దేశంలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని పేర్కొంది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. రెండో దశ కొవిడ్-19 వ్యాప్తి రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్లో గతంలో కంటే 5 రెట్లు అధికంగా ఉందని పేర్కొంది. ఛత్తీస్గఢ్లో 4.5 రెట్లు, దిల్లీలో 3.3 రెట్లుగా పెరిగిందని తెలిపింది.
గత 14 రోజుల్లో కేసుల తీరు, ఆందోళనకరంగా ఉన్న రాష్ట్రాల వివరాలను వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ. మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, ఛత్తీస్గడ్, దిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లో కేసులు గతంలో కంటే గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు పేర్కొంది. కర్ణాటక, కేరళ, బంగాల్, తమిళనాడు, గోవా, ఒడిశాల్లో గరిష్ఠ స్థాయులే కాక, కేసుల వృద్ధిలోనూ గరిష్ఠాన్ని తాకినట్లు తెలిపింది.