తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covaxin India: అంక్లేశ్వర్​ నుంచి కొవాగ్జిన్​ ఫస్ట్​ బ్యాచ్​ విడుదల - BHARAT BIOTECH VACCINE

గుజరాత్​ అంక్లేశ్వర్​ ప్లాంట్​లో తయారైన కొవాగ్జిన్​ (Covaxin India) తొలి బ్యాచ్​ టీకా విడుదలైంది. కేంద్ర మంత్రి మన్​సుఖ్​ మాండవీయ.. ఈ మొదటి బ్యాచ్​ వ్యాక్సిన్​ డోసులను విడుదల చేశారు.

Covaxin India
అంక్లేశ్వర్​లో కొవాగ్జిన్​ ఉత్పత్తి

By

Published : Aug 29, 2021, 12:37 PM IST

భారత్‌ బయోటెక్‌(Bharat Biotech Vaccine).. గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో ఉన్న తన యూనిట్‌లో కొవాగ్జిన్‌(Covaxin India) ఉత్పత్తిని ప్రారంభించింది. పంపిణీకి సిద్ధంగా ఉన్న తొలిబ్యాచ్‌ టీకాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఆదివారం విడుదల చేశారు.

అంక్లేశ్వర్​లో కొవాగ్జిన్​ తొలి బ్యాచ్​ టీకా విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి

భారత్​ బయోటెక్​ ఎండీ, ఛైర్మన్​ కృష్ణ ఎల్ల, ఆయన సతీమణి, జేఎండీ సుచిత్ర ఎల్ల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కొవాగ్జిన్​ టీకాతో భారత్​ బయోటెక్​ జేఎండీ సుచిత్ర ఎల్ల, ఎండీ, ఛైర్మన్​ కృష్ణ ఎల్ల, కేంద్ర మంత్రి మన్​సుఖ్​ మాండవీయ

కరోనాపై పోరాటంలో.. వ్యాక్సినేషన్​ వేగవంతం చేయడమే చాలా ముఖ్యమని ట్వీట్​ చేశారు మాండవీయ. గుజరాత్​లోని అంక్లేశ్వర్​ ప్లాంట్​తో.. ప్రతి భారతీయుడికీ టీకా అందించాలన్న తమ లక్ష్యం నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంక్లేశ్వర్‌ పర్యటనలో భాగంగా భారత్‌ బయోటెక్‌ యూనిట్‌ను(Bharat Biotech Plant) ఆయన సందర్శించారు.

ఒక్కరోజే కోటి డోసులు..

వ్యాక్సిన్‌ తయారీ కోసం.. అంక్లేశ్వర్‌లోని యూనిట్‌కు ఈనెల 10న కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తక్కువ సమయంలోనే ఇక్కడ వ్యాక్సిన్‌ తయారీ(Vaccine producion) ప్రారంభమైంది. ఈ నెల 27న ఒక్కరోజే కోటి డోసుల టీకాను ఉత్పత్తి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మొత్తం ఇక్కడ 20 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు భారత్​ బయోటెక్​ మే నెలలో ప్రకటించింది.

ఇవీ చూడండి: అందరికీ వైద్యం నేటికీ దూరం..!

Corona Update: నాలుగో రోజూ 40వేలకుపైగా కేసులు

ABOUT THE AUTHOR

...view details