తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలోని ప్రతి జిల్లాలో ఓ వృద్ధాశ్రమం' - జిల్లాకొక వృద్ధాశ్రమం ఏర్పాటు చేయనున్న కేంద్రం

union govt old age homes: దేశంలోని ప్రతి జిల్లాలోనూ వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ తెలిపారు. ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా ముందుకు సాగుతోందన్నారు.

old age homes
వృద్ధాశ్రమాలు

By

Published : Jun 6, 2022, 8:11 PM IST

union govt old age homes: దేశంలోని ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్​లో భాగంగా 250 జిల్లాలను గుర్తించామని.. ఆ ప్రాంతంలోని స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి వృద్ధాశ్రమాలు నిర్వహిస్తామని అన్నారు.

మొదటి సారిగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకం ద్వారా విద్యార్థులకు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 41 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని వెల్లడించారు. సీనియర్ సిటిజన్ ఉద్యోగార్ధుల కోసం సీనియర్ ఏబుల్ సిటిజన్స్ ఫర్ రీ-ఎంప్లాయ్‌మెంట్ ఇన్ డిగ్నిటీ (ఎస్​ఏసీఆర్​ఈడీ) పోర్టల్​ను ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఐటీ రంగం అభివృద్ధి కోసం తొమ్మిది స్టార్టప్​లను ప్రారంభించామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా కేంద్రం ప్రభుత్వం పలు పథకాలను తెచ్చిందని అన్నారు.

'నాషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమం జరుగుతోందని మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఉద్యమంలో భాగంగా ఈ ఏడాది 100 జిల్లాలను 'నాషా ముక్త్​'గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్​లో దాదాపు 10.4 కోట్ల మంది వృద్ధులు ఉన్నారు. అందులో 5.3 కోట్ల మహిళలు, 5.1 కోట్ల పురుషులు ఉన్నారు.

ఇదీ చదవండి:కాశీ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారికి ఉరిశిక్ష

ABOUT THE AUTHOR

...view details