మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు(farm laws repeal) చేసే అధికారిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. చట్టాల ఉపసంహరణ బిల్లులకు (Farm laws bill) ఈ బుధవారం జరిగే సమావేశంలోనే మంత్రివర్గం(Union cabinet) ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ఈనెల 29న ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల(winter session of parliament) సమావేశాల్లోనే ఈ బిల్లులను ప్రవేశపట్టనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.