తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర మంత్రులుగా 43 మంది ప్రమాణ స్వీకారం

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా 43 మందికి చోటు కల్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రపతి భవన్​లో మంత్రులుగా ప్రమాణం చేశారు.

Union Cabinet expansion
కేంద్ర మంత్రివర్గ విస్తరణ

By

Published : Jul 7, 2021, 7:45 PM IST

Updated : Jul 7, 2021, 8:27 PM IST

యువత, ప్రాంతాలు, సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రి వర్గాన్ని.. విస్తరించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 43మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. తాజా విస్తరణతో కేంద్ర కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 77కు పెరిగింది.

15 మంది కేబినెట్‌ మంత్రులు, 28మంది సహాయ మంత్రులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ప్రమాణం చేయించారు. 15 మంది కేబినెట్ మంత్రుల్లో ఇప్పటివరకూ సహాయమంత్రులుగా పనిచేసిన ఏడుగురికి పదోన్నతి లభించింది. వారిలో తెలంగాణకు చెందిన కిషన్‌ రెడ్డితో పాటు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కిరణ్ రిజుజు, బిహార్‌కు చెందిన ఆర్‌.కె. సింగ్‌, గుజరాత్‌కు చెందిన మనుసుక్‌ మాండవీయ, పురుషోత్తం రూపాలా, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అనురాగ్ ఠాకూర్‌ దిల్లీకి చెందిన హర్‌దీప్ సింగ్ పూరీ ఉన్నారు.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్‌రాణే, అసోం మాజీ సీఎం, శర్వానంద సోనోవాల్‌, మధ్యప్రదేశ్‌ నుంచి జ్యోతిరాదిత్య సింధియా సహా డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌లను కేబినెట్‌లోకి తీసుకున్నారు. బిహార్‌కు చెందిన రామచంద్రప్రసాద్‌ సింగ్‌, పశుపతి కుమార్‌ పరాస్‌, రాజ్‌కుమార్ సింగ్‌లకు కూడా కేబినెట్‌లో చోటు దక్కింది. ఒడిశా నుంచి అశ్వినీ వైష్ణవ్‌ కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

యూపీకే పట్టం

మంత్రివర్గ విస్తరణలో త్వరలో శాసనసభ ఎన్నికల జరగనున్నదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్‌కు పెద్దపీట వేశారు. UP నుంచి.. ఏడుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ నుంచి ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, బంగాల్‌ నుంచి నలుగురు చొప్పున తీసుకున్నారు. బిహార్‌ నుంచి ముగ్గురు,మధ్యప్రదేశ్‌, దిల్లీ, ఒడిషా నుంచి ఇద్దరు చొప్పున ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.ఉత్తరాఖండ్‌,రాజస్థాన్‌,అసోం,మణిపూర్‌, ఝార్ఖండ్‌, త్రిపుర, తమిళనాడు, హిమాచల్‌ ప్రసాద్‌, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి ఒక్కొక్కరు మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్‌ రెడ్డికి కేబినెట్ మంత్రిగా పదోన్నతిదక్కగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎవరికీ చోటు లభించలేదు.

ఏ వర్గం నుంచి ఎందరంటే?

కేబినెట్‌ విస్తరణ తర్వాత ఓబీసీ మంత్రుల సంఖ్య 27కు పెరిగింది. వారిలో ఐదుగురు కేబినెట్‌ మంత్రులుగా ఉన్నారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి 12మంది ఉండగా..వారిలో ఇద్దరు కేబినెట్‌ మంత్రులు.ఎస్టీ సామాజికవర్గం నుంచి 8 మంది మంత్రులుండగా వారిలో ముగ్గురు కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో 13 మంది న్యాయవాదులు, ఆరుగురు వైద్యులు, ఐదుగురు ఇంజనీర్లు, ఏడుగురు సివిల్‌ సర్వెంట్లు, ఏడుగురు పరిశోధకులు, ముగ్గురు బిజినెస్‌లో పట్టా పొందినవారు ఉన్నారు. 9 రాష్ట్రాల నుంచి 11 మంది మహిళా మంత్రులు కేబినెట్‌లో ఉన్నారు. ముస్లిం, సిక్కు, క్రిస్టియన్‌ వర్గాల నుంచి ఒక్కొక్కరు, ఇద్దరు బౌద్ధులు ఉన్నారు. మైనార్టీ వర్గానికి చెందిన ముగ్గురు కేబినెట్‌ మంత్రులుగా ఉన్నారు.

వారిపై వేటు

గత మంత్రివర్గంలో 53మంది మంత్రులు ఉండగా.. అమాత్యుల పనితీరు, ఇతరత్రా కారణాలతో 12 మందితో రాజీనామా చేయించారు. ఇప్పటివరకూ కేంద్ర మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించిన హర్షవర్ధన్‌, ప్రకాశ్ జావడేకర్, రవిశంకర్ ప్రసాద్‌ రాజీనామా చేశారు. సదానంద గౌడ, రమేశ్ పోఖ్రియాల్‌, సంతోష్‌ గంగవార్, బాబుల్‌ సుప్రియో, సంజయ్‌ ధోత్రే, రతన్‌లాల్‌ ఖటారియా, ప్రతాప్‌ సారంగి, దేబశ్రీ చౌదురీ సైతం రాజీనామా చేయగా... రాష్ట్రపతి ఆమోదించారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు..

నారాయణ్‌ రాణే

  • రాజ్యసభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: మహారాష్ట్ర
  • మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

సర్బానంద సోనోవాల్‌

  • అసోం ఎమ్మెల్యే
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: అసోం
  • అసోం మాజీ సీఎం

వీరేంద్ర కుమార్‌

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: మధ్యప్రదేశ్‌
  • లోక్‌సభ నియోజకవర్గం: టికమ్‌గఢ్‌

జ్యోతిరాదిత్య సింధియా

  • రాజ్యసభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: మధ్యప్రదేశ్‌
  • గతంలో యూపీఏ హయాంలో మంత్రిగా పని చేసిన అనుభవం

రామ చంద్ర ప్రసాద్‌ సింగ్‌

  • రాజ్యసభ ఎంపీ
  • జనతాదళ్‌ యునైటెడ్‌
  • రాష్ట్రం: బిహార్‌
  • మాజీ ఐఏఎస్‌ అధికారి

అశ్వినీ వైష్ణవ్‌

  • రాజ్యసభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: ఒడిశా
  • మాజీ ఐఏఎస్‌ అధికారి

పశుపతి కుమార్‌ పారస్‌

  • లోక్‌సభ ఎంపీ
  • లోక్‌జన్‌శక్తి పార్టీ
  • రాష్ట్రం: బిహార్‌
  • లోక్‌సభ నియోజకవర్గం: హాజీపూర్‌
  • రాంవిలాస్‌ పాసవాన్‌ సోదరుడు

భూపేంద్ర యాదవ్‌

  • రాజ్యసభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: రాజస్థాన్‌
  • భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

పంకజ్ చౌదరి

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: ఉత్తర్‌ప్రదేశ్‌
  • లోక్‌సభ నియోజకవర్గం: మహారాజ్‌గంజ్
  • ఆరుసార్లు ఎంపీగా గెలుపు

అనుప్రియ పటేల్‌

  • లోక్‌సభ ఎంపీ
  • అప్నాదళ్‌
  • రాష్ట్రం: ఉత్తర్‌ప్రదేశ్‌
  • లోక్‌సభ నియోజకవర్గం: మిర్జాపూర్
  • గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం

సత్యపాల్‌ సింగ్‌ బాగెల్‌

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: ఉత్తర్‌ప్రదేశ్‌
  • లోక్‌సభ నియోజకవర్గం: ఆగ్రా

రాజీవ్ చంద్రశేఖర్

  • రాజ్యసభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: కర్ణాటక
  • భాజపా అధికార ప్రతినిధి

శోభా కరంద్లాజే

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: కర్ణాటక
  • ఉడిపి-చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నిక
  • కర్ణాటక మాజీ మంత్రి

భాను ప్రతాప్‌ సింగ్‌ వర్మ

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: ఉత్తర్‌ప్రదేశ్‌
  • లోక్‌సభ నియోజకవర్గం: జాలౌన్‌

దర్శనా జర్దోష్

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: గుజరాత్‌
  • లోక్‌సభ నియోజకవర్గం: సూరత్‌

మీనాక్షి లేఖి

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: దిల్లీ
  • లోక్‌సభ నియోజకవర్గం: న్యూదిల్లీ
  • సుప్రీంకోర్టు న్యాయవాది

అన్నపూర్ణ దేవి యాదవ్

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • ఝార్ఖండ్‌ మాజీ మంత్రి
  • లోక్​సభ నియోజకవర్గం: కోడెర్మా

ఏ. నారాయణస్వామి

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: కర్ణాటక
  • లోక్‌సభ నియోజకవర్గం: చిత్రదుర్గ

కౌశల్‌ కిశోర్‌

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: ఉత్తర్‌ప్రదేశ్‌
  • లోక్‌సభ నియోజకవర్గం: మోహన్‌గంజ్‌

అజయ్‌ భట్‌

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: ఉత్తరాఖండ్‌
  • నైనిటాల్‌-ఉధమ్‌ సింగ్‌ నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నిక

బి.ఎల్‌.వర్మ

  • రాజ్యసభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: ఉత్తర్‌ప్రదేశ్‌

అజయ్‌ కుమార్‌ మిశ్రా

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: ఉత్తర్‌ప్రదేశ్‌
  • లోక్‌సభ నియోజకవర్గం: ఖీరీ

దేవ్‌సింహ్‌ చౌహాన్‌

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: గుజరాత్‌
  • లోక్‌సభ నియోజకవర్గం: ఖెడా

భగవంత్ ఖూబా

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: కర్ణాటక
  • లోక్‌సభ నియోజకవర్గం: బీదర్‌

కపిల్ పాటిల్‌

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: మహారాష్ట్ర
  • లోక్‌సభ నియోజకవర్గం: భివాండి

ప్రతిమ భౌమిక్‌

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: త్రిపుర
  • లోక్‌సభ నియోజకవర్గం: త్రిపుర పశ్చిమం

సుభాష్‌ సర్కార్‌

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: బంగాల్‌
  • లోక్‌సభ నియోజకవర్గం: బంకుర

భాగవత్‌ కిషన్‌రావు కరాడ్‌

  • రాజ్యసభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: మహారాష్ట్ర

రాజ్‌కుమార్ రంజన్‌సింగ్

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: మణిపూర్‌
  • లోక్‌సభ నియోజకవర్గం: ఇన్నర్‌ మణిపూర్‌

భారతి పవార్‌

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: మహారాష్ట్ర
  • లోక్‌సభ నియోజకవర్గం: దిండోరి

బిశ్వేశ్వర్ టూడు

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: ఒడిశా
  • లోక్‌సభ నియోజకవర్గం: మయూర్​భంజ్

శంతను ఠాకూర్

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: బంగాల్‌
  • లోక్‌సభ నియోజకవర్గం: బంగావ్

డా. ముంజపారా మహేంద్ర భాయ్

  • లోక్​సభ ఎంపీ
  • నియోజకవర్గం: సురేంద్ర నగర్(గుజరాత్)

జాన్ బర్లా

  • లోక్​సభ ఎంపీ
  • నియోజకవర్గం: అలిపుర్​దువార్స్​(బంగాల్)

డా. ఎల్ మురుగన్​

  • మద్రాస్ హైకోర్టు న్యాయవాది

శ్రీ నితీశ్ ప్రామాణిక్

  • లోక్​సభ ఎంపీ
  • కూచ్​బిహార్ నియోజకవర్గం(బంగాల్)

పదోన్నతి పొందిన మంత్రులు...

కిరణ్ రిజిజు

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: అరుణాచల్‌ ప్రదేశ్‌
  • ప్రస్తుతం కేంద్ర క్రీడాశాఖ మంత్రి (స్వతంత్ర హోదా)

రాజ్‌ కుమార్‌ సింగ్‌

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: బిహార్‌
  • ప్రస్తుతం కేంద్ర మంత్రి (స్వతంత్ర హోదా)

హర్‌దీప్‌ సింగ్‌ పూరీ

  • రాజ్యసభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: దిల్లీ
  • ప్రస్తుతం పౌరవిమానయాన శాఖ మంత్రి

మన్‌సుఖ్‌ ఎల్‌ మాండవియా

  • రాజ్యసభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: గుజరాత్‌
  • ప్రస్తుతం కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి

పురుషోత్తం రూపాలా

  • రాజ్యసభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: గుజరాత్‌
  • ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ
  • సహాయ మంత్రి

జి. కిషన్‌ రెడ్డి

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: తెలంగాణ
  • లోక్‌సభ నియోజకవర్గం: సికింద్రాబాద్‌
  • ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

అనురాగ్ ఠాకూర్

  • లోక్‌సభ ఎంపీ
  • భారతీయ జనతా పార్టీ
  • రాష్ట్రం: హిమాచల్ ప్రదేశ్‌
  • లోక్‌సభ నియోజకవర్గం: హమీర్‌పూర్
  • ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి
Last Updated : Jul 7, 2021, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details