కేంద్రం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని మాజీ ప్రధాని, కాంగ్రెస్‌నేత మన్మోహన్ సింగ్ విమర్శించారు. దానివల్ల అసంఘటిత రంగమూ అతలాకుతలం అయిందని ఆరోపించారు. ప్రసుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వనికి సమాఖ్య వ్యవస్థపై గౌరవం లేదని, చాలా విషయాల్లో రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరదని అన్నారు. కేరళ అభివృద్ధి కోసం రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ ఏర్పాటు చేసిన సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్నారు మన్మోహన్.
"భారత ఆర్థికరంగానికి , రాజకీయ సిద్ధాంతానికి సమాఖ్య వ్యవస్థ మూలస్తంభం లాంటిది. అయితే రాజ్యంగంలో పేర్కొన్న సమాఖ్య వ్యవస్థకు ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేదు. 2016లో కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అసంఘటిత రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. నిరుద్యోగం విపరీతంగా పెరగడానికి కారణమైంది."
- మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని
కేరళ సామాజిక ప్రమాణాలు బలంగా ఉన్నాయి, కానీ: