Unemployed Protest Rajasthan: రాజస్థాన్ జైపుర్‌లో షహీద్ స్మారక్ వద్ద 49 రోజులుగా నిరసన చేస్తున్న నిరుద్యోగ యువకులు.. తమ ఆందోళనలను సరిహద్దు దాటించారు. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల.. కొంత మంది యువకులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చేరుకొని నిరసన తెలుపుతున్నారు. నిరుద్యోగ సంఘం నాయకుడు ఉపెన్ యాదవ్ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బయటే నిద్రిస్తున్న యువకులు హోర్డింగుల కింద నిరసనకారులు Rajasthan Unemployed Protest UP:
రాజస్థాన్ బేరోజ్‌గార్ ఏకీకృత్ మహాసంఘ్(ఆర్బీఈఎం) ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి. రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను పెంచాలని, పరీక్ష ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినవారిని కఠినంగా శిక్షించేలా చట్టాన్ని తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా నిరసనలు గహ్లోత్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఇది కాంగ్రెస్‌కు చేటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వీటిని గ్రహించిన గహ్లోత్.. నిరసనలపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళన చేస్తున్న యువకులకు ఉద్యోగాలు అవసరం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:50 చోట్ల ఐటీ సోదాలు- రూ.500 కోట్ల నల్లధనం గుర్తింపు!