గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు తీవ్ర అస్వస్థత - chota rajan corona news

16:12 May 07
గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు తీవ్ర అస్వస్థత
అండర్‌వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఓ కేసులో దిల్లీలో తిహాడ్ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న అతను.. ఏప్రిల్ 22న వైరస్ బారిన పడ్డాడు. చికిత్స నిమిత్తం ఏప్రిల్ 24న అధికారులు అతడ్ని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ముంబయిలో సినిమా టిక్కెట్‌లను బ్లాక్‌లో అమ్ముతూ తన నేర ప్రస్థానాన్ని ప్రారంభించాడు చోటా రాజన్. తన గురువు బడా రాజన్ వద్ద ఉండి అనేక నేరాలకు పాల్పడ్డాడు. కొన్నాళ్లు దావూద్ ఇబ్రహీంతో కూడా కలిసి పని చేశాడు. విదేశాలకు పారిపోయి తలదాచుకున్న చోటా రాజన్‌ను 2015లో ఇండోనేషియాలోని బాలిలో అరెస్టు చేశారు.