నిర్మాణంలో ఉన్న గోదాము కూలి ఐదుగురు మృతి - godown collaped
14:48 July 15
నిర్మాణంలో ఉన్న గోదాము కూలి ఐదుగురు మృతి
Godown Collapsed: దిల్లీలోని అలీపుర్లో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న ఓ గోదాము కూలిపోయింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గాయపడగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
శిథిలాల కింద మరికొంత మంది కూలీలు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో అక్కడ 20-25 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ గోదామును అక్రమంగా నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికే లిఖితపూర్వంగా ఫిర్యాదు చేసినా నిర్మాణ పనులు ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:Viral Video: సుడిగాలి బీభత్సం.. వణికిపోయిన ఊరి జనం