తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి.. తల్లి, కుమారుడు మృతి - బెంగుళూరులో కూలిన మెట్రో పిల్లర్

నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్​ కూలిపోయి ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

Metro pillar collapsed in Bengaluru
Metro pillar collapsed in Bengaluru

By

Published : Jan 10, 2023, 1:30 PM IST

Updated : Jan 10, 2023, 2:31 PM IST

ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్​ కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబలోని ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నగావర ప్రాంతంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోహిత్​ కుమార్​, తేజశ్విని హోరమావు ప్రాంతానికి చెందిన వారు. వారికి కవల పిల్లలు ఉన్నారు. లోహిత్​.. రోజూ తన భార్య తేజశ్వినిని ఆఫీస్​ వద్ద దిగబెట్టి.. పిల్లలను బేబీ సిట్టింగ్​కు తీసుకెళ్లేవాడు. మంగళవారం కూడా అలానే బైక్​పై వేళ్తుండగా.. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్​ వారిపై కూలింది. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా తేజశ్విని(28 ఏళ్లు), కుమారుడు విహాన్​(2.5 ఏళ్లు) మృతిచెందారు. లోహిత్​.. అతడి కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు.

కూలిన మెట్రో పిల్లర్​

మెట్రో పిల్లర్​ కూలడం వల్ల ఆ ప్రాంతలో దాదాపు 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్​ జామ్​ అయింది. స్థానికులు, మెట్రో సిబ్బంది సహాయంతో కూలిపోయిన పిల్లర్​ను, ఇనుప రాడ్లను క్లియర్​ చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత మెట్రో ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనే జరిగిందని.. ఆ ప్రమాదంలో తల్లీకుమారులు మృతిచెందారని ఈస్టెర్న్​ డివిజన్ డీసీపీ భీమశంకర్​ గులేడా చెప్పారు.

కూలిన మెట్రో పిల్లర్​

ఇవీ చదవండి :పప్పు గిన్నెలో పాము.. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత

Last Updated : Jan 10, 2023, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details