రాజస్థాన్‌లో జోధ్‌పుర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ గోడ కూలి 8 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు క్షతగాత్రులయ్యారని పోలీసులు తెలిపారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది.. మృతదేహాలను వెలికితీశారు. బస్నీ ఇండస్ట్రియల్ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు.
సీఎం దిగ్భ్రాంతి