Uncle Raped One Year Old Girl: హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడాదిన్నర వయసు గల మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు మేనమామ. చిన్నారిని నహాన్ వైద్య కళాశాలకు తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలను సేకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని.. ఆదివారం కోర్టులో హాజరుపరిచారు.
ఏడాదిన్నర చిన్నారిపై అత్యాచారం.. సొంత మేనమామనే! - Uncle Raped One Year Old Girl
Uncle Raped Child: ఏడాదిన్నర వయసు గల మేనకోడలిపై అత్యాచారం చేశాడు ఆమె మేనమామ. ఈ అమానవీయ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో జరిగింది.
Girl raped in Nahan
ఇదీ జరిగింది: బంగాల్ నుంచి వలస వెళ్లిన కుటుంబం సిర్మౌర్లో కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. వారి ఇంటి పక్కనే ఉండే చిన్నారి మేనమామ.. ఆమెను ఎత్తుకొని తన ఇంటికి తీసుకెళ్లాడు. కొంతసేపటికి చిన్నారి సోదరుడు.. తన చెల్లెలు ఏడుపు విన్నాడు. దీంతో ఇంట్లోకి వెళ్లిన అతడు.. తన చెల్లెల్ని తీసుకుని వెళ్లి అక్కడ జరిగిన విషయాన్ని అందరికీ చెప్పాడు.
ఇదీ చదవండి:నడిరోడ్డుపైనే తల్లిదండ్రులను నరికేసిన కుమారుడు.. ఎందుకంటే?
Last Updated : Apr 10, 2022, 10:34 PM IST