తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆన్​లైన్​ గేమ్స్​కు బానిస- అప్పులు కట్టలేక ఆత్మహత్య - ఆన్​లైన్​ గేమ్స్​కు బానిస

ఆన్​లైన్​లో గేమ్స్​కు బానిసయ్యాడు. ఆ ఆటలు ఆడేందుకు అప్పులు చేశాడు. అవి కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Unable to repay loan taken to play online games, man hangs self in Indore
ఆన్​లైన్​ గేమ్స్​కు బానిస- అప్పులు కట్టలేక ఆత్మహత్య

By

Published : Feb 23, 2022, 7:33 AM IST

మధ్యప్రదేశ్​, ఇండోర్​లో విషాదం జరిగింది. ఆన్​లైన్​ గేమ్స్​కు బానిసైన ఓ యువకుడు వాటికోసం చేసిన అప్పులు కట్టలేక తనువు చాలించాడు. ఇండోర్​లోని ఇంద్రపురి హాస్టల్​లో ఉండే జితేంద్ర వసాకల్(25) గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు భవర్​ఖాన్ పోలీసులు తెలిపారు.​ జితేంద్ర జేబులో సూసైడ్​ నోట్​ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

కొన్ని ఆన్​లైన్ గేమ్స్​ ఆడేందుకు అప్పులు చేశానని.. అవి కట్టలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నాడని అన్నారు ఏఎస్సై రామ్​ప్రసాద్. అయితే ఎంత అప్పు చేశాడో మాత్రం లేఖలో చెప్పలేదని వివరించారు.

మృతుడి స్వస్థలం మహారాష్ట్ర కాగా.. ప్రస్తుతం కంప్యూటర్ అప్లికేషన్స్​లో పోస్ట్ గ్యాడ్యూయేట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాక సెక్యూరిటీ గార్డ్​గానూ పనిచేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:రేప్​ను ప్రతిఘటించిందని బాధితురాలి హత్య.. శవంపైనే అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details