తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లంచం ఇవ్వలేక కారుణ్య మరణానికి సిద్ధమైన దంపతులు..! - కర్ణాటక లేటెస్ట్​ అప్డేట్స్​

తమకున్న పొలాన్ని లేఔట్​గా మార్చాలనుకున్నారు. దానికి సంబంధించిన అనుమతి కోసం గ్రామ పంచాయతీలో రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అయితే పత్రాలు ఇవ్వాలంటే తమకు లంచం ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు అధికారులు. దీంతో విస్తుపోయిన ఆ దంపతులు ఇక తనువు చాలించాలనుకుని కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు.

Unable to give bribe to officials: Couple applies for euthanasia
Unable to give bribe to officials: Couple applies for euthanasia

By

Published : Nov 12, 2022, 1:14 PM IST

లంచం అడుగుతున్న అధికారులకు ఎదురు చెప్పలేక.. తమ భూమిని కోల్పోలేక ఓ దంపతలు కారుణ్య మరణం ద్వారా తనువు చాలించాలనుకున్నారు. ఈ మేరకు తమ అభ్యర్థన పత్రాన్ని అసిస్టెంట్​ కమిషనర్​ ద్వారా రాష్ట్రపతికి పంపించారు. ఈ ఘటన కర్ణాటకలోని శిమొగ్గలో జరిగింది.

శివమెగ్గకు కాండికాకు చెందిన శ్రీకాంత్​, సుజాతా నాయక్​ దంపతులకు ఆ గ్రామంలో కొంత వ్యవసాయ భూమి ఉంది. దానిని లేఔట్​ చేసుకునేందుకు గ్రామ పంచాయతీకి డబ్బులు చెల్లించారు. అయితే ఆ తాలూకా పంచాయతీకి చెందిన ఓ సీనియర్ అధికారి వారి వద్ద నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. అది ఇవ్వలేమని వారు చెప్పినా వినకుండా మరో అధికారి ద్వారా ఒత్తిడి తెచ్చారు. పలుమార్లు సంబంధిత అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయింది. న్యాయం చేయాలని కోరుతూ సాగర్‌ సబ్‌ డివిజనల్‌ అధికారి కార్యాలయం ఎదుట బైఠాయించారు దంపతులు. ఎంత చేసినా అధికారులు తగ్గకపోవడం వల్ల విసుగు చెందిన దంపతులు.. చేసేదేమీలేక ఇక మరణమే శరణ్యం అనుకుని కారుణ్య మరణానికి అభ్యర్థించారు. దీనిపై కర్ణాటకలోని ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details