Una minor rape: 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాధితురాలిని బెదిరించవచ్చని ఘటనను వీడియోలో రికార్డు చేశాడు. కొన్ని రోజులు తరువాత ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. బాలిక స్నేహితులు విషయాన్ని ఆమెకు తెలిపారు. దీంతో బాధితురాలు జరిగిందంతా కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంటనే వారు బంగానా మహిళా పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనాలో జరిగింది.
నిందితుడుకి, మైనర్కి సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అనంతరం పరిచయం కాస్త స్నేహంగా మారింది. మార్చి 9న నిందితుడు.. బాధితురాలిని బంగానా పట్టణంలో తనను కలవాలని కోరాడు. అతనితో కలిసి ఒక హోటల్‌కు రమ్మని ఆమెను బలవంత పెట్టాడు. ఆ తరువాత ఆమెపై అత్యాచారానికి పాల్పడి రహస్యంగా వీడియో తీశాడు. పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మరిన్ని ఆధారాలను సేకరించేందుకు హోటల్లో తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.