Umabharathi fire on wine shop: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతికి కోపం వచ్చింది. మద్యాన్ని నిషేధించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న ఆమె.. తాజాగా భోపాల్‌లోని ఓ మద్యం దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఓ బండరాయితో లిక్కర్ దుకాణంలోకి నేరుగా వెళ్లిన ఆమె.. మద్యం బాటిళ్లను పగులగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉమాభారతి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలని ఆమె ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. 2022 జనవరి 15 నాటికి రాష్ట్రంలో లిక్కర్ విక్రయాలను నిషేధించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపడతామని ఆమె గతేడాదే ప్రకటించారు. మద్యం దుకాణాల ముందు కూర్చొని నిరసన తెలియజేస్తానని కూడా వెల్లడించారు.
మాజీ సీఎం ఆగ్రహం.. మద్యం దుకాణం ధ్వంసం - మద్యం దుకాణం ధ్వంసం చేసిన ఉమాభారతి
Umabharathi fire on wine shop: భాజపా ఫైర్ బ్రాండ్ ఉమాభారతికి వైన్ షాపును చూడగానే కోపం వచ్చింది. దీంతో ఓ బండ రాయిని తీసుకుని లిక్కర్ షాపుపై దాడి చేశారు.
మరోవైపు శివరాజ్‌సింగ్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. మద్యాన్ని మరింత తక్కువ ధరకే విక్రయించనున్నట్లు పేర్కొంది. ఉమాభారతి విధించిన డెడ్‌లైన్ దాటిన 2 రోజులకే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. విదేశీ మద్యం అమ్మకాలకు కూడా అనుమతించింది. దీంతో పాటు విదేశీ మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని 10-13 శాతం తగ్గించింది. ప్రజలు గతంలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ మద్యం ఇంట్లో ఉంచుకోవచ్చని ప్రకటించింది. వార్షిక ఆదాయం రూ.కోటి కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు ఇంట్లోనే బార్‌ను తెరుచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇదీ చూడండి:ఉత్తరాఖండ్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా రీతూ?