కేరళలో ఓ ఏనుగు దృష్టిని పరీక్షించేందుకు అల్ట్రాసౌండ్ సోనోగ్రామ్(యూఎస్జీ) స్కానింగ్ చేశారు అధికారులు. ఇటీవల దాని కళ్లు తెల్లబడటం వల్ల.. చూపు కోల్పోయి అనేక సమస్యలను ఎదుర్కుంటుందనే అనుమానంతో ఈ విధమైన పరీక్షలు నిర్వహించారు.
ఎందుకు స్కానింగ్?
కొల్లాం జిల్లా మావెలిక్కరకు చెందిన చిన్నూ.. 45ఏళ్ల ఏనుగును పోషిస్తున్నాడు. దాన్ని ముద్దుగా కన్నన్ అని పిలుచుకుంటాడతడు. ఇటీవల కన్నన్ కళ్లు తెల్లగా మారడం వల్ల.. అది కంటిచూపు సమస్యలను ఎదుర్కొంటోందని గ్రహించాడు. ఈ నేపథ్యంలో జిల్లాలోని డాక్టర్ అరవిందన్ అనే పశు వైద్యుణ్ని సంప్రదించాడు. కన్నన్‌కు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలని ఆ వైద్యుడు సలహా ఇచ్చారు.
ఇదీ చదవండి:బోరుబావిలో గున్న ఏనుగు- స్థానికుల సహాయంతో బయటకు
ఎలా చేశారు?
కన్నన్ను బయట నిల్చోబెట్టి, గదిలోని యంత్రాలతో యూఎస్జీ స్కానింగ్ తీశారు. ఈ సమయంలో దాన్ని స్కానింగ్‌కు అనుకూలమైన ప్రదేశంలో నిల్చోబెట్టేందుకు వైద్యుడు, యజమాని తీవ్రంగా శ్రమించారు. ఆ తర్వాత దాన్ని నేలపై పడుకోబెట్టి ఇంజక్షన్ ఇచ్చేందుకూ ఆపసోపాలు పడ్డారు. గజరాజులకు ఇలాంటి పరీక్షలు చేయడం చాలా అరుదని ఆ వైద్యుడు చెప్పారు.