తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సొంత కమిటీ సభ్యులను చంపిన నక్సల్స్​.. ప్రేమే కారణం! - నక్సల్స్​ ప్రేమ జంటను చంపిన మావోలు

Naxal couple kill: పారిపోయి పెళ్లి చేసుకోవాలని భావించిన ఇద్దరు మావోయిస్టులను సొంత గ్రూప్​ సభ్యులు హత్య చేశారు. వీరితో పాటు మరో వ్యక్తిని కూడా హతమార్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Ultras kill Naxal couple
నక్సల్స్​ ప్రేమ జంటను చంపిన మావోలు

By

Published : Jan 7, 2022, 10:15 PM IST

Naxal couple kill: రెండు వేర్వేరు ఘటనల్లో సొంత క్యాడర్​కు చెందిన ముగ్గుర్ని హత్య చేశారు నక్సల్స్​. వారిలో ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని భావించి బయటకు వచ్చేయగా ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనలు చత్తీస్​గఢ్​ బీజాపుర్​లోని అడవుల్లో జరిగినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

గంగలూర్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఉండే ఓ మావోయిస్ట్​ గ్రూప్​ నుంచి ప్రేమ జంట పారిపోయి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలని భావించి బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. వీరితో పాటే మరో వ్యక్తిని కూడా హత్య చేసినట్లు వివరించారు.

గంగలూర్ ప్రాంతంలో జరిగిన నక్సల్స్​ హత్యల గురించి పోలీసులకు సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ తెలిపారు. మరిన్ని వివరాలు సేకరిస్తునట్లు పేర్కొన్నారు.

"ప్రాథమిక సమాచారం ప్రకారం.. మావోయిస్ట్​ కమాండర్​ కామ్లు పునెం, సభ్యురాలు మంగి ఇద్దరూ గ్రూప్​ నుంచి పారిపోయి వచ్చారు. వారు ప్రేమికులు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వారి క్యాడర్​కు చెంది ఇతర సభ్యులు ఇందినార్​ అనే గ్రామంలో జన్​ అదాలత్​ నిర్వహించి ఘోరంగా చంపారు."

- పోలీసులు

11 కేసుల్లో పునెం.. వాంటెడ్​ నక్సల్​గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగిపై కూడా మూడు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిద్దరికీ మావోయిస్టుల గంగలూర్​ ఏరియా కమిటీతో సంబంధాలున్నాయని చెప్పారు. చనిపోయిన మూడో వ్యక్తికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి:ఒక్కరోజులోనే కరోనా కేసులు డబుల్.. భారత్​లో ఎందుకీ దుస్థితి?

ABOUT THE AUTHOR

...view details