తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ చేరుకున్న మూడో విమానం.. భారత్​కు మరో 240 మంది - ఉక్రెయిన్ భారత్​ విమానాలు

Ukraine India News: యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి తాజాగా భారత్​కు 240 మంది వచ్చారు. ఆపరేషన్ గంగా ద్వారా దిల్లీకి చేరిన మూడో విమానం ఇది.

Indian students arrive from Ukraine
ఉక్రెయిన్​ నుంచి భారత్​కు మరో 240 మంది..

By

Published : Feb 27, 2022, 11:25 AM IST

Updated : Feb 27, 2022, 12:10 PM IST

Ukraine India News: ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చే ప్రక్రియలో భాగంగా హంగరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 240 మందితో బయలుదేరిన ఎయిర్‌ఇండియా మూడో విమానం దిల్లీ చేరింది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు 709 మంది వచ్చారు.

భారత్‌ నుంచి రొమేనియాకు రెండు విమానాలు పంపగా.. 219 మందితో శనివారం మొదటి విమానం ముంబయి చేరుకుంది. రొమేనియా నుంచి 250 మందితో, బుడాపెస్ట్ నుంచి 240 మందితో బయలేరిన రెండు విమానాలు దిల్లీకి చేరుకున్నాయి.

ఉక్రెయిన్​ నుంచి సురక్షితంగా భారత్ కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

బయల్దేరిన నాలుగో విమానం..

ఉక్రెయిన్​ సరిహద్దు దేశం రొమేనియాలోని బుచారెస్ట్​​ నుంచి నాలుగో విమానం బయల్దేరింది. ఈ విమానంలో 198 మంది భారతీయులు స్వదేశానికి రానున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు.

Last Updated : Feb 27, 2022, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details