Indian Embassy officials to leave Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో రాయబార కార్యాలయ సిబ్బంది కుటుంబసభ్యులకు కేంద్రం కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఆ దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చని తక్షణమే కుటుంబ సభ్యులతో పాటు ఉక్రెయిన్ వదిలి స్వదేశానికి తిరిగిరావాలని సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో నాటో దేశాలు, రష్యా మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అత్యవసరం లేనివారు, విద్యార్థులు ఉక్రెయిన్ వీడాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. అందుకు అనుగుణంగా కమర్షియల్, ఛార్టర్ విమానాలు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఎంబసీ ఫేస్బుక్, ట్విట్టర్, వెబ్సైట్ చూడాలని పేర్కొంది. ఈ క్రమంలోనే ఎంబసీ సిబ్బంది కుటుంబసభ్యులు కూడా స్వదేశానికి రావాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది.