తెలంగాణ

telangana

ETV Bharat / bharat

31 విమానాలు.. 6,300 మంది.. పక్కా ప్లాన్​తో 'ఆపరేషన్​ గంగ' - ఉక్రెయిన్​ రష్యా యుద్ధం

Evacuation flights: రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. రానున్న వారం రోజుల్లో మొత్తం 31 విమానాల్లో 6,300 మంది పౌరులను తరలించేందుకు షెడ్యూల్​ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

evacuation flights
ఉక్రెయిన్​కు విమానాలు

By

Published : Mar 2, 2022, 2:16 PM IST

Evacuation flights: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన 'ఆపరేషన్​ గంగ' ను వేగవంతం చేసింది కేంద్రం. ఇప్పటికే పలు విమానాల్లో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. వాయుసేన సైతం రంగంలోకి దిగింది. రానున్న రోజుల్లో మొత్తం 31 విమానాల ద్వారా.. 6,300 మందికిపైగా భారత పౌరులను స్వదేశానికి తీసుకురానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

బుకారెస్ట్​లో సిద్ధంగా ఉన్న భారత పౌరులు

"ఆపరేషన్​ గంగలో ఎయిర్​ ఇండియా, ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​, ఇండిగో, స్పైస్​జెట్​, ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ విమానాలు భాగం కానున్నాయి. మార్చి 2 నుంచి రొమేనియాలోని బుకారెస్ట్​ నుంచి 21, హంగెరీలోని బుడాపెస్ట్​ నుంచి 4, పోలండ్​లోని ర్జెస్జో నుంచి 4, స్లోవేకియాలోని కొసిసే నుంచి ఒక విమానం భారతీయులను తరలించేందుకు షెడ్యూల్​ చేశాం. బుకారెస్ట్​ నుంచి భారత వాయుసేన పౌరులను స్వదేశానికి తీసుకొస్తుంది. మొత్తంగా మార్చి 2 నుంచి 8 తేదీల మధ్య 31 విమానాల ద్వారా 6,300 మందిని తరలించనున్నాం."

- అధికార వర్గాలు.

ఎయిర్​ఇండియా ఎక్స్​ప్రెస్, స్పైస్​జెట్​​ సుమారు 180మంది సామర్థ్యం, ఎయిర్​ఇండియా, ఇండిగోలు 250, 216 ప్రయాణికుల సామర్థ్యంతో విమానాలను నడపనున్నాయని అధికారులు తెలిపారు.

ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలకు తరలివెళ్తున్న వాయుసేన విమానాలు

ఫిబ్రవరి 26 నుంచి ఇప్పటి వరకు 9 విమానాల్లో ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు చెప్పారు అధికారులు. మరో 5-6 విమానాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆపరేషన్​ గంగాలో భాగంగా ఒక్కరోజే 6 విమానాల్లో మొత్తం 1,377 మంది భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్​ ట్వీట్​ చేశారు. అంతకు ముందు రోజు.. 2వేల మంది భారత్​కు చేరుకున్నారని, మరో 4-5వేల మంది సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ సెక్రెటరీ హర్షవర్ధన్​ శ్రింగ్లా తెలిపారు.

బుకారెస్ట్​లో భారతీయ విద్యార్థులు

ఇదీ చూడండి:ఉక్రెయిన్​ నింగిపై పట్టు కోసం రష్యా తిప్పలు.. బాంబులు లేవా?

పుతిన్​ ధైర్యం 'సెర్గీ'.. మరి జెలెన్​స్కీ వెనుక ఎవరున్నారు?

'రష్యా భల్లూకం పట్టులో ఉక్రెయిన్​.. ఇండియాకు ఇబ్బందికరమే!'

ABOUT THE AUTHOR

...view details