స్నేహితుల వేట సరదా నలుగురి ప్రాణాలను బలిగొంది. అడవిలో వేటకు వెళ్తున్న క్రమంలో తుపాకీ మిస్‌ఫైర్ అయి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన ముగ్గురు స్నేహితులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లాలోని కుందీ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో జరిగింది.
ఇదీ జరిగింది..
జిల్లాలోని భిలాంగన బ్లాక్‌లోని ఓ గ్రామానికి చెందిన ఏడుగురు స్నేహితులు శనివారం రాత్రి అడవిలోకి వేటకు వెళ్లారు. రాజీవ్(22) తూటాలు నింపిన తుపాకీతో ముందుండి తమ బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే కాలుకి ఏదో తగిలి అదుపుతప్పి కిందపడిపోయాడు. తుపాకీ మిస్‌ఫైర్ అయి సంతోశ్ అనే యువకుడికి తూటా తగిలింది. రక్తం ఎక్కువగా పోవటం వల్ల సంతోశ్ అక్కడే ప్రాణాలొదిలాడు. ఈ ఘటనతో స్నేహితులంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలోనే రాజీవ్ తుపాకీతో పరారయ్యాడు. మరో ముగ్గురు సోబన్, పంకజ్, అర్జున్‌లు.. క్రిమిసంహారక రసాయనాలు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.