ఉత్తరాఖండ్ రవాణా శాఖ మంత్రి యశ్‌పాల్ ఆర్య (Yashpal Arya News) కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన యశ్‌పాల్.. సీనియర్ నేతలు హరీశ్ రావత్, కేసీ వేణుగోపాల్ తదితరుల సమక్షంలో ఆయన కుమారుడు సంజీవ్‌తో (Yashpal Arya Sanjeev Arya) పాటు ఆ పార్టీలో చేరారు. దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో యశ్‌పాల్ సోమవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అంతకుముందు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ఆయన నివాసంలో యశ్‌పాల్ (Yashpal Arya News) భేటీ అయ్యారు. యశ్‌పాల్ ఆర్య, ఆయన కుమారుడు (Yashpal Arya Sanjeev Arya) తిరిగి కాంగ్రెస్‌లో చేరడం.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయ అవకాశాలు ఎక్కువున్నాయనేందుకు సంకేతమని సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
ఆరు టికెట్లు..
సొంతగూటికి చేరుకున్న యశ్‌పాల్.. రానున్న ఎన్నికల్లో తన వర్గానికి 6 ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారని.. కానీ దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదని సమాచారం.