తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Kumbh Mela: ఫేక్ కరోనా టెస్టులపై 'సిట్' దర్యాప్తు

ఉత్తరాఖండ్​​ హరిద్వార్​లో కుంభమేళాకు (Kumbh Mela) హాజరైన లక్ష మందికి పైగా భక్తులకు నకిలీ కొవిడ్ పరీక్షలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ అంశంపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు ఉత్తరాఖండ్ పోలీసులు.

Covid testing during Kumbh
కుంభమేళా కరోనా

By

Published : Jun 19, 2021, 10:50 AM IST

హరిద్వార్​లో కుంభమేళాకు (Kumbh Mela) హాజరైన లక్ష మందికి పైగా భక్తులకు నకిలీ కొవిడ్ పరీక్షలు చేశారని వార్తలు వస్తున్న క్రమంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టేందుకు హరిద్వార్ ఎస్​పీ సెంథిల్​ అవూధాయ్ కృష్ణరాజ్ ఎస్ నేతృత్వంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. విచారణను వేగవంతం చేసేందుకే సిట్​ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

అంతకుముందు.. నకిలీ కొవిడ్ పరీక్షలు నిర్వహించిన ల్యాబ్​లపై కేసు నమోదు చేశారు పోలీసులు.

వివాదం ఏంటంటే?

కుంభమేళా(Kumbh Mela) నిర్వహించేందుకు సిద్ధమైన ఉత్తరాఖండ్ సర్కారు.. భక్తులకు కొవిడ్ టెస్టులు చేయాలని నిర్ణయించుకొని, ఇందుకోసం ప్రైవేటు ల్యాబ్​లను నియమించుకుంది. అయితే, ఈ ల్యాబ్​లు నకిలీ కరోనా ధ్రువపత్రాలను జారీ చేస్తున్నాయని మీడియా కథనాల ద్వారా బయటపడింది.

ఇదీ చదవండి :కుంభమేళాలో నకిలీ కరోనా రిపోర్టులు- 'అడ్రెస్' లేని ల్యాబ్

ABOUT THE AUTHOR

...view details