UKG Student Died Beaten by Teacher in Ramanthapur :. విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన వారు ఉపాధ్యాయులు. ఇందుకోసం వారికి ఎంతో సహనం, ఓర్పు ఉండాలి. కానీ కొందరు టీచర్లు.. కొన్నిచోట్ల వారు ప్రవర్తిస్తున్న తీరు.. వారి వృత్తికే కళకం తెచ్చే విధంగా మారింది. హూం వర్క్ చేయలేదని ఓ టీచర్.. విద్యార్థి తలపై పలకతో కొట్టింది. దీంతో సదరు బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందతూ మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రామంతపూర్ ( Ramanthapur) వివేక్ నగర్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో యూకేజీ చదువుతున్న విద్యార్థి హేమంత్ మృతి చెందాడు. శనివారం హోం వర్క్ చేయలేదని టీచర్.. బాలుడి తలపై పలకతో కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే పాఠశాల యాజమాన్యం హేమంత్‌ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం హేమంత్ మృతి చెందాడు.
Boy Dies Trying to Imitate YouTube Video : యూట్యూబ్ దృశ్యాలను అనుకరించబోయి.. ఆరో తరగతి విద్యార్థి మృతి
UKG Student Hemanth Died in Ramanthapur : దీంతో ఈరోజు హేమంత్ ( Hemanth) మృతదేహంతో.. పాఠశాల ముందు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన యాజమాన్యం న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం వారు వనపర్తికి తరలించారు. గత కొంత కాలంగా హేమంత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.
Teacher Beats Students Karimnagar : 'మీరు పుట్టి వేస్ట్ రా' అంటూ.. విద్యార్థులను చితకబాదిన టీచర్
Teacher Beats Students in Secunderabad : ఇటీవలే తన నిద్రకు భంగం కలిగించాడని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. విద్యార్థిని స్కేల్‌తో చితక బాదాడు. ఈ ఘటన సికింద్రాబాద్ ( Secunderabad) కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆశీష్ కుమార్ అనే విద్యార్థి.. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో.. విద్యార్థులు లేకపోవడంతో అదే స్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రవి కుమార్ తరగతి గదిలో నిద్రిస్తున్నాడు. పాఠశాల విరామం సమయం ముగియడంతో.. విద్యార్థులు ఒక్క సారిగా పెద్ద శబ్ధం చేస్తూ తరగతి గదిలోకి వచ్చారు.
దీంతో రవి కుమార్ తనకు నిద్ర భంగమైందని భావించాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహంతో అక్కడున్న విద్యార్థులను స్కేల్‌తో చితక బాదాడు. తన టేబుల్ పక్కనే ఉన్న ఆశీష్ కుమార్ పిక్కలు, మోకాలి కింది భాగంలో గట్టిగా కొట్టాడు. ఆశీష్ కుమార్ వాళ్ల అమ్మ స్నానం చేయించే క్రమంలో.. బాలుడి శరీరంపై నల్లగా కమిలినట్లు ఉండే గాయాలను గుర్తించింది. ఏం జరిగిందని విద్యార్థిని ఆరా తీయగా జరిగిన విషయం తల్లికి చెప్పాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి.. ఉపాధ్యాయడు రవి కుమార్‌ను నిలదీయగా.. తాను కొట్టలేదని బుకాయించాడు.
పాఠాలు చెప్పాల్సిన గురువే పాడు పని చేశాడు.. బాలిక గర్భం దాల్చడంతో..!
మిగతా విద్యార్థులు సైతం.. తమను కొట్టిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు.. రవి కుమార్‌పై కార్ఖానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు సరైనా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు.. వారే ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని పిల్లల తల్లిందడ్రులు వాపోతున్నారు. ఈ ఘటనపై సంబంధించి పై అధికారులు స్పందించి.. మరోసారి ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూడలని కోరుతున్నారు.
Student Suspicious Death: గిరిజన వసతి గృహంలో దారుణం.. నాలుగో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి
Bachupally Road accident : చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు.. డ్రైవర్ నిర్లక్ష్యం, గుంతల రోడ్డుతో చిట్టి తల్లి ప్రాణాలు బలి