భారత నావికాదళంతో కలిసి భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలు జరపనుంది బ్రిటన్. ఇందుకోసం బ్రిటన్కు చెందిన హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ యుద్ధ నౌక హిందూమహాసముద్రంలోకి ప్రవేశించింది. బ్రిటన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ 40 దేశాల పర్యటనలో భాగంగా.. భారత్, బ్రిటన్ సంయుక్తంగా ఈ యుద్ధ విన్యాసాలు చేపట్టనున్నాయి.
ఈ విన్యాసాలతో.. భారత్, బ్రిటన్ మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని బ్రిటన్ విదేశాంగ ప్రతినిధి డొమినిక్ రాబ్ తెలిపారు. తమ యుద్ధ నౌక పర్యటనలో భాగంగా 40 దేశాలతోనూ సత్సంబంధాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపార కార్యకాలాపాలు వృద్ధి చెందనున్నాయని అన్నారు. సముద్ర మార్గంలో ఏర్పడే విపత్తులను సంయుక్తంగా ఎదుర్కోవచ్చని తెలిపారు.
జులై 26న..