తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగ్గురు కుమార్తెలతో కలిసి వ్యక్తి బలవన్మరణం, రైలు కింద పడి - కుమార్తెలతో కలిసి తండ్రి బలవన్మరణం

ఒక వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతటి హృదయ విదారక సంఘటనకు కారణమేంటన్న విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మధ్యప్రదేశ్​ ఉజ్జయిన్​లో ఈ ఘటన జరిగింది.

ujjain mass suicide
ujjain mass suicide

By

Published : Aug 18, 2022, 12:30 PM IST

మధ్యప్రదేశ్​ ఉజ్జయిన్​లో దారుణం జరిగింది. ఆ ప్రాంతానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాయి ఖేదీ రైల్వేస్టేషన్​​ దగ్గర్లోని రైల్వే ట్రాక్​పై ఓ తండ్రి, ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ట్రాక్​పై సూసైడ్​ నోట్​ దొరకటంతో ఇది ఆత్మహత్యగా అధికారులు నిర్ధరించారు.

అసలేం జరిగింది:మృతుడిని గోయ్​లా బుజుర్గ్ గ్రామానికి చెందిన రవి పంచాల్​గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే అతడు తన ముగ్గురు కూతుర్లు అనామిక, ఆరాధ్య, అనుష్కతో కలిసి బైక్​పై నాయి ఖేదీ రైల్వే స్టేషన్​కు చేరుకుని.. గూడ్స్​ ట్రైన్​ కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. 'ట్రాక్​పై వారిని ​గమనించినప్పటికీ ఎమర్జెన్సీ బ్రేక్​ వేయలేకపోయాను. బ్రేక్​ పడుంటే ఇలాంటి దారుణం జరిగేది కాదు' అని ఆవేదన వ్యక్తం చేశారు గూడ్స్​లోని లోకో పైలట్. అయితే.. ఓ మహిళ వేధింపుల కారణంగానే రవి సూసైడ్​ చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details