UIIC Assistant Jobs 2023 : చెన్నైలోని ప్రభుత్వ రంగ బీమా సంస్థ 'యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ'.. శాశ్వత ప్రాతిపదికన 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న యూఐఐసీ కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- యూఆర్ - 159 పోస్టులు
- ఓబీసీ - 55 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 30 పోస్టులు
- ఎస్సీ - 30 పోస్టులు
- ఎస్టీ - 26 పోస్టులు
- మొత్తం పోస్టులు - 300
నోట్ : తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో 8, తెలంగాణలో 3 అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు
UIIC Assistant Eligibility :అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
UIIC Assistant Age Limit :
- అభ్యర్థుల వయస్సు 2023 సెప్టెంబర్ 30 నాటికి 21 ఏళ్లు నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లులు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
దరఖాస్తు రుసుము
UIIC Assistant Application Fee :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా జీఎస్టీ కూడా కట్టాల్సి ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, కంపెనీ ఉద్యోగులు అప్లికేషన్ ఫీజుగా రూ.250 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.