UIDAI Warning To Aadhaar Users :భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI).. ఎప్పటికప్పుడు ఆధార్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే కొన్నిరోజుల క్రితం.. పదేళ్లు దాటితే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోమని యూఐడీఏఐ సూచించింది. దీంతో కొందరు దగ్గర్లోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటుండగా.. మరికొందరు ఆన్లైన్లో తమ పని పూర్తి చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే సైబర్ నేరగాళ్లు.. ఆధార్ అప్డేట్ మాటున పంజా విసురుతున్నారట. దీంతో అప్రమత్తమైన UIDAI.. ఆధార్ కార్డు హోల్డర్లకు వార్నింగ్ ఇచ్చింది. ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డును అప్డేట్ కోసం పత్రాలను షేర్ చేయవద్దని హెచ్చరించింది.
'UIDAI అలా ఎప్పుడూ కోరదు'
UIDAI Warns Users : "UIDAI ఎప్పుడూ ముఖ్యమైన డాక్యుమెంట్లను షేర్ చేయమని అడగదు. మీ ఆధార్‌ను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా అప్డేట్ చేయడానికి మీ POI/POA పత్రాలను షేర్ చేయమని మిమ్మల్ని ఎప్పుడూ కోరదు. my Aadhaar Portal ద్వారా ఆన్లైన్లో మీ ఆధార్‌ను అప్డేట్ చేసుకోండి లేదా మీకు సమీపంలోని ఆధార్ కేంద్రాలను సందర్శించండి" అని UIDAI సూచించింది.