Aadhar Card Update: ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటితే.. గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాల్ని మళ్లీ సమర్పించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ-యూఐడీఏఐ సూచించింది. గత పదేళ్లలో ఆధార్‌ను ఒక్కసారి కూడా అప్డేట్ చేయని వారు ఈ పని చేయాలని కోరింది. అయితే.. ఐడెంటిటీ, రెసిడెన్స్ ప్రూఫ్ డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది యూఐడీఏఐ.
"పదేళ్ల క్రితం ఆధార్ తీసుకుని, అప్పటి నుంచి తమ వివరాలను అప్డేట్ చేయని వారు.. డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించాలని కోరుతున్నాం. గుర్తింపు పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను నిర్దేశిత రుసుము చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు. 'మై ఆధార్' పోర్టల్ లేదా దగ్గర్లోని ఆధార్ కేంద్రం నుంచి ఈ పని పూర్తి చేయవచ్చు" అని ఓ ప్రకటనలో పేర్కొంది యూఐడీఏఐ.