తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా దృష్ట్యా యూజీసీ నెట్ పరీక్ష వాయిదా - రమేశ్ పోఖ్రియాల్

కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో మే 2 నుంచి జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొత్త తేదీని పరీక్షకు కనీసం 15 రోజుల ముందు ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Ramesh Pokhriyal
రమేశ్ పోఖ్రియాల్

By

Published : Apr 20, 2021, 4:35 PM IST

కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 2 నుంచి జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. కొత్త తేదీని పరీక్షకు 15 రోజుల ముందు ప్రకటిస్తామని ట్విట్టర్​ ద్వారా తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మే 2న ప్రారంభమై మే 17 వరకూ పరీక్షను నిర్వహించాల్సి ఉండగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా వేశారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తరఫున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ- ఎన్​టీఏ యూజీసీ నెట్ పరీక్షను నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ అర్హత కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు.

ఇదీ చదవండి :ముంబయిలో 2,200 రెమ్​డెసివిర్​ వయల్స్​ సీజ్​

ABOUT THE AUTHOR

...view details