UGC-NET phase 2 postponed: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండో దశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 12 నుంచి 14 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ నెలఖారులో నిర్వహిస్తామని యూజీసీ ఛైర్మన్ వెల్లడించారు.
యూజీసీ-నెట్ రెండో దశ పరీక్షలు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే? - UGC NET phase 2 postponed
UGC-NET phase 2 postponed: యూజీసీ-నెట్ రెండో దశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 12 నుంచి 14 వరకు జరగాల్సి ఉండగా.. సెప్టెంబరు నెలలో నిర్వహిస్తామని యూజీసీ ఛైర్మన్ తెలిపారు.
UGC-NET phase 2 postponed
"యూజీసీ-నెట్ రెండో దశ ఈ నెల 12, 13, 14 తేదీల్లో నిర్వహించాలని ముందుగా నిర్ణయించాం. ఇప్పుడు ఈ పరీక్షలను వచ్చే నెల(సెప్టెంబరు) 20 నుంచి 30 తేదీల మధ్య నిర్వహిస్తాం" అని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు.
యూజీసీ-నెట్ మొదటి ఫేజ్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ.. జులై 9, 11, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా 225 నగరాల్లో నిర్వహించింది.
ఇదీ చదవండి:35 ఏళ్ల క్రితం ఆమె స్వీపర్.. ఇప్పుడు అదే బ్యాంకుకు AGM!