తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మే నెలలో యూజీసీ- నెట్ పరీక్ష - రమేశ్​ పోఖ్రియాల్​

యూజీసీ-నెట్​ పరీక్షను మే నెలలో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్​ వెల్లడించారు.

UGC-NET exam to be conducted in May: Education Minister Pokhriyal
మే నెలలో యూజీసీ-నెట్ పరీక్ష

By

Published : Feb 2, 2021, 5:33 PM IST

యూజీసీ-నెట్​ పరీక్ష తేదీలను ప్రకటించింది కేంద్ర విద్యాశాఖ. అసిస్టెంట్​ ప్రొఫెసర్ల​ ఎంపిక కోసం నిర్వహించే యూజీసీ-నెట్​(జాతీయ అర్హత పరీక్ష)ను మే నెలలో నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ తెలిపారు. దీనికి సంబంధించి జాతీయ పరీక్షల సంస్థ(ఎన్​టీఏ) ఓ నోటిఫికేషన్​ విడుదల చేసింది.

"జూనియర్ రీసెర్చ్​ ఫెలోషిప్​ (జేఆర్​ఎఫ్​)​, అసిస్టెంట్​ ప్రొఫెసర్ల అర్హత కోసం ఎన్​టీఏ నిర్వహించే యూజీసీ-నెట్ పరీక్షలు.. 2021 మే 2,3,4,5,6,7,10,11,12,14,17 తేదీల్లో జరగనున్నాయి. పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు."

- రమేశ్​ పోఖ్రియాల్​, కేంద్ర విద్యా శాఖ మంత్రి

మేలో నిర్వహించనున్న ఈ నెట్​ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి. దీనిని కంప్యూటర్​ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు.

ఇదీ చూడండి:దిల్లీలో 56% మందిపై కరోనా ప్రభావం!

ABOUT THE AUTHOR

...view details