తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పాకిస్థాన్​లో చదివితే డిగ్రీలు చెల్లవు.. ఉద్యోగాలు రావు'

పాకిస్థాన్​లో చదివే భారతీయ విద్యార్థుల డిగ్రీలు ఇకపై చెల్లవు. అక్కడ ఉన్నత విద్యను అభ్యసించవద్దని యూజీసీ, ఐఏసీటీఈ ప్రకటించాయి. ఆ డిగ్రీలతో ఇక్కడు ఉద్యోగాలకు అర్హులు కారని తేల్చిచెప్పాయి.

Indian students
'పాకిస్థాన్​లో చదివే భారతీయ విద్యార్థుల డిగ్రీలు చెల్లవు'

By

Published : Apr 23, 2022, 1:30 PM IST

Indian students degrees not valid: పాకిస్థాన్‌లో భారత విద్యార్థులు డిగ్రీలు, ఇతర ఉన్నత చదువులు అభ్యసించవద్దని యూజీసీ, ఐఏసీటీఈ తేల్చి చెప్పాయి. పాకిస్థాన్‌లోని విశ్వవిద్యాలయాల్లో చేసిన కోర్సులు భారత్‌లో చెల్లుబుటు కావని విద్యార్థులకు స్పష్టం చేశాయి. ఉన్నత చదువుల కోసం ఎవరూ పాకిస్థాన్‌కు వెళ్లొద్దని వెల్లడించాయి. పాకిస్థాన్‌లో చదువుకున్న విద్యార్హతలతో భారత్‌లో ఉద్యోగం చేయడానికి, ఉన్నత చదువులు చదవడానికి అనర్హులు అవుతారని పేర్కొన్నాయి.

UGC on Pak degrees: పాకిస్థాన్‌కు వలస వెళ్లిన వారు, వారి పిల్లలు భారత పౌరసత్వం కలిగి ఉన్నవారి డిగ్రీలు.. కేంద్ర హోంశాఖ భద్రతాపరమైన అనుమతితో పరిగణిస్తామని సంస్థలు తేల్చి చెప్పాయి. ఈమేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. పాకిస్థాన్​లో చదివే భారతీయ విద్యార్థల సంఖ్య తక్కువే ఉంటున్నప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా యూజీసీ, ఐఏసీటీఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

యూజీసీ, ఐఏసీటీఈ ప్రకటన

ఇదీ చదవండి:టీచర్ల నిర్వాకం.. విద్యార్థినులను బంధించి పాఠశాలకు తాళం

ABOUT THE AUTHOR

...view details