తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే? - telugu panchangam

Horoscope Today : ఈ రోజు (మార్చి 22) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today
Horoscope Today

By

Published : Mar 22, 2023, 6:18 AM IST

Horoscope Today: ఈ రోజు (మార్చి 22) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

ఈరోజు మీరు ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపుతారు. కానీ, మీరు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండకపోవచ్చు. అనవసరమైన వ్యయాలు ఎక్కువ కావచ్చు. మీ పొదుపును పెట్టుబడిగా పెట్టడానికి ఇది మంచిరోజు. మీరు దానధర్మాలు చేయడం వలన ఫలితాలు లేకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

ఈ రోజు ఎక్కువ భాగం సంతోషంగా ఉంటారు. స్నేహితులు, ప్రియమైన వారు మీకు ఆప్యాయతతో కూడిన వాతావరణాన్ని కల్పిస్తారు. కొత్త పరిచయాలు, స్నేహాలు మీ వ్యాపారానికి లేదా వృత్తికి ప్రయోజనంగా ఉంటాయి. ఒక చిన్న విహారయాత్ర చాలా సంతోషాన్నిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈరోజు మీకు అన్నివిధాలా ఆనందాన్ని కలిగిస్తుంది.

ఈరోజు మీరు మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. వృత్తిపరంగా కూడా ప్రశంసలను అందుకునే అవకాశం ఉంది. దీనివల్ల మీలో ఉత్సాహం పెరుగుతుంది. మీ సహోద్యోగులు మీకు సహాయకరంగా ఉంటారు. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది.

విదేశాల నుంచి ఒక ఆనందకరమైన లేదా శుభప్రదమైన వార్త వింటారు. ఆహ్లాదకరమైన ప్రయాణం చేస్తారు. మీరు చేయబోతున్న వాటన్నిటిలో అదృష్టం ఉంటుంది. మీకు చాలా తృప్తిని, ఉప్పొంగిపోయే అనుభూతిని కలిగిస్తాయి. మీరు ఈ ప్రతిఫలాలను అంగీకరిస్తారు. దేవునికి ఏంతో కృతజ్ఞులై ఉంటారు.

ఈ రోజలు ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం ఉంది. కలవరపెడుతున్న ఆరోగ్య సమస్య, ఆపరేషన్.. ఏమైనా సరే దానితో ముందుకు సాగండి. ఎందుకంటే ఆరోగ్యం మీ మొదటి ప్రాధాన్యత. పని నుంచి విరామం తీసుకోండి. మీ భోజనాలు అన్నీ ఇంటి వద్దే చేయండి. మానసికంగా, ప్రతికూలత మిమ్మల్ని పీడిస్తుంది.

ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. నిన్నటి నుంచి నక్షత్రాలు మీ పట్టికలో బలంగా ఉన్నాయి. అంతేగాక, మీ జీవితం, కెరీర్​లోని అన్నీ ప్రాంతాల్లో విజయాన్ని పొందవచ్చు. మీ మిరుమిట్లు గొలిపే నవ్వును ప్రకాశింపజేయండి. నక్షత్రాలు ఇప్పుడు అనుగ్రహించే ఔదార్యాన్ని కృతజ్ఞతతో స్వీకరించండి.

మీరు ఈరోజు మొత్తం పనుల్లో నిమగ్నమై ఉంటారు. మారే సమయాలకు అనుగుణంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి షాపింగ్ చేస్తారు. మీ శారీరక, మానసిక శక్తి ఉర్రూతలూగుతూ పరిసరాలను ప్రకాశవంతంగా ఉంచుతాయి. ఈ రోజు మీరు ఆనందంగా గడుపుతారు. కీర్తి, గుర్తింపు లభిస్తాయి. రుచికరమైన తినుబండారాలు తినే అవకాశం ఉంది.

మీరు ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా శక్తిమంతంగా ఉంటారు. అనారోగ్యంతో బాధ పడుతున్నవారికి ఉత్సాహాన్ని అందించడానికి ఇది మంచి సమయం. గణనీయమైన ఆరోగ్య మెరుగుదలకు కచ్చితమైన అవకాశం ఉంది. మీ సహోద్యోగుల నుంచి మీకు సహకారం, మద్దతు లభించవచ్చు. విజయవంతంగా పోటీదారులను అధిగమించడానికి అవకాశం ఉంది.

జీర్ణ సంబంధమైన సమస్యలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. మీ పిల్లల చదువులు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు రోజు మొత్తం మీ మనస్సులో మెదులుతూ ఉంటాయి. మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకొని, మేధోపరమైన చర్చల నుంచి దూరంగా ఉంటే మంచిది. అయితే, మీరు ఈరోజు కళలు, సాహిత్యం వైపు ఆసక్తిని పెంపొందించుకుంటారు.

మీ లక్ష్యాలు సాధించే విధంగా మీ వేగాన్ని పెంచుతారు. కాని వాటిని మీరు సకాలంలో పూర్తి చేయలేరు. కానీ దానికోసం నిరాశ చెందకండి. రేపు భిన్నంగా ఉంటుందని ఆశించండి. ఆ బాధ నుంచి ఉపశమనం కోసం కొంత విశ్రాంతి తీసుకోండి.

మీకు వివిధ విషయాలపై నిర్ణయం తీసుకోవడం కష్టం అనిపిస్తుంది. అనవసరపు వ్యయాలు చేయకండి. మీరు జాగ్రత్తగా మాట్లాడకపోతే మీ కుటుంబసభ్యులతో వాగ్వివాదాలు రావచ్చు. విద్యార్ధులు తమ చదువులపైన దృష్టి సారించాలి. విజయం సాధించడానికి కొంత సమయం పడుతుంది. కాస్త ఓపిక పట్టాలి.

ఈ రోజు మీకు కొంత చేదుగానే ఉంటుంది. మీరు అనుకున్న పనులు జరగకపోవచ్చు. కానీ దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. ప్రకృతిని ఆస్వాదించండి. ఇంత చక్కని జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి.

ABOUT THE AUTHOR

...view details