తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడు మంత్రివర్గంలోకి వారసుడు.. మంత్రిగా ఉదయనిధి స్టాలిన్​! - ఉదయనిధి మంత్రి తమిళనాడు

స్టాలిన్‌ తనయుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్‌ కేబినెట్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. ఏడాదిగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన త్వరలోనే మంత్రి పదవి చేపట్టనున్నారు.

Etv Tamilnadu Udhayanidhi Minister
Tamilnadu Udhayanidhi Minister

By

Published : Dec 12, 2022, 10:09 PM IST

Udhayanidhi Stalin Minister: తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మార్పు జరగనుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనయుడు, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌ మంత్రివర్గంలోకి అడుగు పెట్టబోతున్నారు. చెపాక్‌-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి 2021లో విజయం సాధించిన ఉదయ నిధి స్టాలిన్‌.. ఏడాదిగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రభుత్వ పదవిలోనూ లేరు. ఈ నేపథ్యంలోనే ఆయనను త్వరలోనే మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారు. డిసెంబర్‌ 14న ఆయన మంత్రివర్గంలోకి చేరుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఉదయనిధి స్టాలిన్‌ను తీసుకోవడంతో పాటు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. దీనిపై పార్టీ అధికార ప్రతినిధి రవీంద్రన్‌ స్పందిస్తూ.. ఉదయనిధి మంత్రి కావాలని పార్టీ నేతలు చాలా రోజుల నుంచి కోరుకుంటున్నారని చెప్పారు. అయితే, అది సీఎం స్టాలిన్‌ చేతిలోనే ఉందని పేర్కొన్నారు. యువతను ఆకట్టుకునే కీలక విభాగానికి ఉదయనిధిని మంత్రిని చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనిబట్టి ఉదయనిధికి యువజన, క్రీడా మంత్రిత్వశాఖ బాధ్యతలు అప్పగిస్తారని అంచనా. మంత్రి పదవి గురించి ఉదయనిధిని విలేకరులు ప్రశ్నించగా.. సమాధానం దాటవేశారు. ఈ వార్తలపై అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పళని స్వామి సైతం స్పందించారు. డీఎంకే కుటుంబ పార్టీగా మారిపోయిందంటూ ఎద్దేవా చేశారు. ఇక సీనియర్లకు డమ్మీ శాఖలను కేటాయించబోతున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details