UDDHAV Thackeray comments on Modi: గోద్రా అల్లర్ల తర్వాత (2002) అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ వచ్చిందని.. ఆ సమయంలో ఆయనకు తన తండ్రి, శివసేన వ్యవస్థాపకులు, దివంగత బాల్ ఠాక్రే మద్దతుగా నిలిచారని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.
'ఆ సమయంలో మోదీకి మా తండ్రి అండగా నిలిచారు' - నరేంద్ర మోదీని బాల్‌ఠాక్రే
UDDHAV Thackeray comments on Modi: గోద్రా అల్లర్ల తర్వాత అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ వచ్చిందని అన్నారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. అప్పుడు శివసేన వ్యవస్థాపకులు, దివంగత బాల్ ఠాక్రే.. మోదీకి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. కాగా మోదీని తాను వ్యక్తిగతంగా గౌరవిస్తానని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.
అప్పట్లో భాజపా కీలక నేత ఎల్.కె. అడ్వాణీ ఓ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబయి వచ్చిన సందర్భంగా ఈ విషయమై బాల్ ఠాక్రేతో చర్చించారన్నారు. ఓ మరాఠీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ధవ్ మాట్లాడారు. అడ్వాణీతో భేటీలో మోదీని తొలగించవద్దని తన తండ్రి చెప్పినట్లు వివరించారు. కాగా మోదీని తాను వ్యక్తిగతంగా గౌరవిస్తానని ఉద్ధవ్ ఠాక్రే ఈ సందర్భంగా చెప్పారు. "అంటే దీనర్థం తక్షణమే జట్టు కట్టాలనా? నేనలా చెప్పను. దీన్ని నేను వ్యక్తిగతంగానే చెబుతున్నాను. ఆత్మీయత అనేది మన సంస్కృతి" అని ఉద్ధవ్ పేర్కొన్నారు. భాజపాయేతర పార్టీలకు వ్యతిరేకంగా కేంద్రం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందన్న ఆరోపణలను ఆయన వద్ద ప్రస్తావించగా.. దేనికైనా ఓ పరిమితి ఉంటుందంటూ దీన్ని వ్యతిరేకించారు. "ప్రధాని మొత్తం దేశానికి చెందినవారు.. ఓ పార్టీకి కాదు" అని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:Modi Europe Trip: 'ఐరోపాతో బంధం పటిష్ఠం చేసుకుంటాం'