తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Uddhav Thackeray BJP: 'భాజపాతో దోస్తీ వల్ల 25 ఏళ్లు వృథా' - ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్య

Uddhav Thackeray BJP: భారతీయ జనతా పార్టీతో దోస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. భాజపాతో స్నేహం వల్ల శివసేన 25 ఏళ్లు వృథా అయ్యాయని పేర్కొన్నారు.

Uddhav thackeray
ఉద్ధవ్ ఠాక్రే

By

Published : Jan 24, 2022, 5:24 AM IST

Uddhav Thackeray BJP: భారతీయ జనతా పార్టీతో దోస్తీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే. భాజపాతో స్నేహం వల్ల తమకు ఒరిగిందేమీ లేదని.. శివసేనకు 25 ఏళ్లు వృథా అయ్యాయని వ్యాఖ్యానించారు.

శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే 96వ జయంతి సందర్భంగా వర్చువల్​ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్ధవ్​ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసమే భాజపా హిందుత్వ నినాదం చేస్తోందని ఆరోపించారు. శివసేన భాజపాకు మాత్రమే దూరమైందని హిందుత్వకు కాదని అన్నారు.

2019 మహారాష్ట్ర ఎన్నికల అనంతరం భాజపాకు గుడ్​ బై చెప్పింది శివసేన. ఎన్సీపీ, కాంగ్రెస్​తో చేతులు కలిపి మహా వికాస్ అఘాడి సర్కారు ఏర్పాటు చేసింది.

ABOUT THE AUTHOR

...view details