తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో చెన్నైలోని చేపాక్కం-ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి డీఎంకే యువజన విభాగ కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ పార్టీకి గతంలో దరఖాస్తు చేసుకున్నారు.
స్టాలిన్ కుమారుడి 'స్వీటు' ఇంటర్వ్యూ! - డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ రాజకీయ పార్టీల నుంచి టికెట్లు ఆశించే అభ్యర్థులు ఎంతోమంది ఉంటారు. వారందరి గెలుపు అవకాశాలను బేరీజు వేసి పార్టీలు టికెట్లు ఖరారు చేస్తుంటాయి. అయితే తమిళనాడులోని డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సీటు కోసం ఇంటర్వ్యూకి హాజరయ్యారు.

స్టాలిన్ కుమారుడి 'స్వీటు' ఇంటర్వ్యూ!
ఆశావహుల జాబితాలో ఉన్న ఉదయనిధిని.. పార్టీ ప్రధాన కార్యాలయమైన అణ్ణా అరివాలయంలో ఆయన తండ్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్లు శనివారం ఇంటర్వ్యూ చేశారు.
ఇదీ చదవండి:తమిళనాట 25 చోట్ల బరిలో కాంగ్రెస్
Last Updated : Mar 8, 2021, 6:08 AM IST