UCIL Apprentice Jobs 2023 :ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్న్యూస్. ఝార్ఖండ్ రీజియన్ జాదుగూడలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ - యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐల్) 243 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఉద్యోగాలు
UCIL Vacancy 2023 :
- జాదుగూడ యూనిట్ - 102
- తురామ్దీహ్ యూనిట్ - 90
- నర్వాపహార్ యూనిట్ - 51
- మొత్తం పోస్టులు - 243
ఈ ట్రేడు విభాగాలు
ట్రేడ్ | ఖాళీలు |
ఫిట్టర్ | 82 |
ఎలక్ట్రీషియన్ | 82 |
వెల్డర్(గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) | 40 |
టర్నర్/ మెషినిస్ట్ | 12 |
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ | 05 |
మెకానిక్ డీజిల్/ మెకానిక్ ఎంవీ | 12 |
కార్పెంటర్ | 05 |
ప్లంబర్ | 05 |
విద్యార్హతలు..
UCIL Apprentice Eligibility : అభ్యర్థులు పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఏజ్ లిమిట్..
UCIL Apprentice Age Limit : అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2023 అక్టోబరు 13 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు సహా ఇతర కేటగిరీలకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము..
UCIL Apprenticeship Application Fees :అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం..
UCIL Apprentice Selection Process :అభ్యర్థులను ఐటీఐలో సాధించిన మార్కుల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.