తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Two Young Women Suicide : వాట్సాప్‌ డీపీ మార్ఫింగ్.. ఇన్‌స్టాలో ఫొటోలు వైరల్‌.. ఇద్దరు యువతుల సూసైడ్ - ఫొటోలు మార్ఫింగ్ చేశారని విద్యార్థినుల సూసైడ్

Two Young Women Suicide in Nalgonda District
Two Young Women Suicide

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 8:37 AM IST

Updated : Sep 6, 2023, 1:29 PM IST

08:31 September 06

Two Young Women Suicide : వాట్సాప్‌ డీపీ మార్ఫింగ్.. ఇన్‌స్టాలో ఫొటోలు వైరల్‌.. ఇద్దరు యువతుల సూసైడ్

Two Young Women Suicide in Nalgonda District :నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది ఆకతాయిలు.. తమ వాట్సాప్‌ డీపీలను అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసి.. సామాజిక మాధ్యమాల్లో(Social Media) పెట్టారనే మనస్తాపంతో నల్గొండలోని రాజీవ్‌ పార్కులో మంగళవారం ఇద్దరు యువతులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అనంతరం పార్కు గేటు బయట ఉన్న ఓ చెట్టు కిందకు వచ్చి పడిపోయారు. గమనించిన స్థానికులు యువతులిద్దరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు ఆ ఇద్దరు మృతి చెందారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Man Blackmailed Girl at jawaharnagar : 'ఇన్​స్టాగ్రామ్​లో ఫాలో అవ్వకపోతే.. ఫొటోలు మార్ఫింగ్​ చేస్తా'

పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలానికి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు (19) జిల్లా కేంద్రంలోని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ ఇద్దరు ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి స్నేహితులు. ఇటీవల సెలవులు రావడంతో 20 రోజులుగా ఇళ్ల వద్దే ఉంటున్నారు. మంగళవారం రోజున కాలేజీలో ల్యాబ్‌ పరీక్షలు ఉన్నాయని ఇళ్లల్లో చెప్పి.. ఉదయం 9 గంటలకల్లా నల్గొండకు చేరుకున్నారు. నేరుగా స్థానిక ఎన్జీ కళాశాల వెనక భాగంలో ఉన్న రాజీవ్‌ పార్కుకు వెళ్లారు. అక్కడ ఓ గంటకు పైగా గడిపిన తర్వాత తమవెంట తెచ్చుకున్న గడ్డి మందును కూల్‌డ్రింక్స్‌లో కలుపుకుని తాగేశారు. ఆపై హాస్టల్‌లో ఉంటున్న తమ స్నేహితురాలికి ఫోన్‌ చేసి విషయాన్ని చెప్పారు. అనంతరం పార్కు గేటు బయట ఉన్న ఓ చెట్టు కిందకు వచ్చి పడిపోయారు.

Rape on Minor Girl in Hyderabad : సెల్‌ఫోన్ ఆశ చూపి.. మైనర్‌ బాలికపై తండ్రీకుమారుల అత్యాచారం

యువతులను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతులిద్దరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్యం అందించారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం యువతులిద్దరు మృతి చెందారు. తమ ఫొటోలను మార్ఫింగ్‌(Morphing Photos Viral in Social Media) చేసి.. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి బెదిరింపులకు పాల్పడుతుండటంతోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాళ్లు పేర్కొన్నట్లు సమాచారం.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నల్గొండ టూ టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అమ్మాయిలను వేధించి.. బ్లాక్​మెయిల్ చేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఆ యువతల మొబైల్ ఫోన్ సంభాషణలను పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు తమ కూతుళ్ల మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మృతురాళ్ల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

మా పిల్లలకు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవు. ఎవరో ఫోన్‌ చేసి 3 రోజులుగా బెదిరిస్తున్నారట. ఇద్దరు కలిసి రూ.15 లక్షలు ఇవ్వాలని వేధిస్తున్నారట. అంత డబ్బు ఇచ్చే పరిస్థితులు లేవని.. కుటుంభసభ్యులకు భారం కావొద్దని భావించి గడ్డి మందు తాగారట. మా పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తులను శిక్షించి.. మాకు న్యాయం చేయాలి.-బాధిత కుటుంబసభ్యులు

మహిళా ఉద్యోగి పట్ల ఆసుపత్రి డైెరెక్టర్ లైంగిక వేధింపులు.. ఏంటని నిలదీస్తే..!

Women Blackmail Case in Hyderabad : రూ.లక్షలు ఇస్తానంటూ మత్తులోకి దించి.. నగ్నంగా చిత్రీకరించి.. ఆపై బెదిరింపులు

Last Updated : Sep 6, 2023, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details