తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Two Women Walking Naked On Road : నగ్నంగా రోడ్డుపై తల్లీకూతుళ్లు.. శాలువా కప్పి కాపాడిన ఎమ్మెల్యే - Tribal woman walking naked on road

Two Women Walking Naked On Road : పట్టపగలే నడిరోడ్డుపై నగ్నంగా తిరుగుతున్న తల్లీకూతుళ్లను రక్షించారు ఓ బీజేపీ ఎమ్మెల్యే. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు గిరిజన మహిళలకు.. తన వాహనంలోని శాలువాలను తీసి కప్పారు. అనంతరం వారి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Two Women Walking Naked On Road
Two Women Walking Naked On Road

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 6:15 PM IST

Updated : Oct 8, 2023, 8:17 PM IST

Two Women Walking Naked On Road :మధ్యప్రదేశ్​లో 8 ఏళ్ల అత్యాచార బాధితురాలు నగ్నంగా తిరిగిన ఘటన మరవకముందే మరొకటి జరిగింది. ఒడిశాలోని సుందర్​గఢ్​లో ఓ గిరిజన మహిళ సహా ఆమె కూతురు.. పట్టపగలే రోడ్డుపై నగ్నంగా వెళుతూ కనిపించారు. వీరిని గమనించిన బీజేపీ ఎమ్మెల్యే.. వారికి శాలువాలు కప్పి రక్షించారు. ప్రస్తుతం వీరిద్దరి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని.. దీంతో స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే, ఓ యువకుడు.. తమపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు.

ఇదీ జరిగింది
ఝార్ఖండ్​ సిమడెగా జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళకు పెళ్లి కాగా.. భర్త మరణించాడు. దీంతో ఆమె తన ముగ్గురు కుమార్తెలు, కొడుకుతో కలిసి నివసిస్తోంది. దీనిని ఆసరాగా చేసుకున్న అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు.. తన ముగ్గురు కుమార్తెలను లైంగికంగా హింసించేవాడు. దీనికి ఎదురు తిరగడం వల్ల దారుణంగా కొట్టేవాడు. తరచూ లైంగికంగా హింసిస్తూ, దాడి చేయడం వల్ల మానసిక అనారోగ్యానికి గురైన మహిళ.. తన కూతురిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళలు.. శుక్రవారం ఒడిశాలోని సుందర్​గఢ్​లో నగ్నంగా కనిపించారు.

రోడ్డుపై నగ్నంగా వెళ్తున్న మహిళలను గమనించిన బీజేపీ ఎమ్మెల్యే కుసుమ్ తితి.. వారిని రక్షించారు. తల్లీకూతుళ్లకు తన వాహనంలోని శాలువాలను తీసి కప్పారు. అనంతరం పోలీసుల సహాయంతో మానసిక రోగుల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళలు వైద్యుల సంరక్షణలో ఉన్నారని ఎస్​పీ ప్రత్యూష్​ దివాకర్ తెలిపారు. అయితే, వీరిద్దరూ ఝార్ఖండ్​ నుంచి ఒడిశాకు ఎలా వచ్చారనే విషయంపై దర్యాప్తు చేపట్టామని చెప్పారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ మహిళ అధికారి నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి చేరుకున్న ఈ బృందం.. ఇద్దరు గిరిజన మహిళల నుంచి వివరాలను సేకరించింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తు కోసం సుందర్​గఢ్​ ఎస్​పీ ఆధ్వర్యంలో ఓ బృందం ఝార్ఖండ్​కు బయలుదేరింది.

Woman Paraded : గిరిజన మహిళపై దారుణం.. నగ్నంగా మార్చి.. గ్రామమంతా ఊరేగించిన భర్త.. అత్తమామలు కూడా!

నగ్నంగా మహిళల ఊరేగింపు ఘటన..​ నిందితుడి ఇల్లు దగ్ధం.. టైర్లతో కాల్చేసిన గ్రామస్థులు

Last Updated : Oct 8, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details