తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొండచరియలు విరిగిపడి ఇద్దరు మహిళలు మృతి - ఒడిశాలో విరిగిపడిన కొండచరియలు

ఒడిశాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మహిళలు చనిపోయారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఓ కల్వర్టు నిర్మాణ పనులు చేస్తుండగా..ఈ ప్రకృతి విపత్తు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.

landslides
కొండచరియలు

By

Published : Jun 28, 2021, 12:31 AM IST

ఒడిశా గంజాం జిల్లాలో కొండ చరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. దిగపహండి పోలీసు స్టేషన్​ పరిధిలోని ఘైగూడ వద్ద రహదారిపై కల్వర్టు నిర్మాణ పనులు చేస్తున్న కూలీలపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.

సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు
శిథిలాలు తొలగిస్తున్న సిబ్బంది

దీంతో కొండచరియల కింద ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురిని అధికారులు కాపాడారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. ముగ్గురిని స్వల్పగాయాలతో బయటకు తీశారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

శిథిలాలు తొలగిస్తున్న సిబ్బంది
భారీ యంత్రాలతో శిథిలాలు తొలగిస్తున్న అధికారులు

ఆ కల్వర్టు నిర్మాణ పనుల్లో 20 మంది కూలీలు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:Viral Video: రాడ్డుతో బైకర్​ తల పగలగొట్టిన వ్యక్తి

ABOUT THE AUTHOR

...view details