భారత సైన్యం ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వైమానిక దళం కోసం మొట్టమొదటిసారిగా ఇద్దరు మహిళా అధికారులను యుద్ధ హెలికాప్టర్ల పైలట్ల శిక్షణకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు బుధవారం వెల్లడించారు. మహిళలను పైలట్లుగా నియమించే ప్రతిపాదనకు ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణె ఆమోదం తెలిపిన ఆరు నెలల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.
ఆ పైలట్ల శిక్షణకు తొలిసారి ఇద్దరు మహిళలు - యుద్ధ హెలికాప్టర్ల పైలట్ల శిక్షణ
వైమానిక దళం కోసం మొదటిసారిగా ఇద్దరు మహిళా అధికారులను యుద్ధ హెలికాప్టర్ల పైలట్ల శిక్షణకు ఎంపిక చేసింది భారత సైన్యం. మహిళలను పైలట్లుగా నియమించే ప్రతిపాదనకు ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణె ఆమోదం తెలిపిన ఆరు నెలల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.
ఇప్పటివరకూ మహిళలు వైమానిక దళానికి చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలోనూ, క్షేతస్థాయి విధులనూ నిర్వర్తించడానికే అనుమతి ఉంది. పైలట్లుగా చేరేందుకు 15 మంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని, అత్యంత కఠినమైన ఎంపిక ప్రక్రియలో ఇద్దరు మాత్రమే అర్హత సాధించారని అధికారులు తెలిపారు. వారు మహారాష్ట్రలోని నాసిక్‌లో శిక్షణ తీసుకోనున్నారని చెప్పారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది జులైలో వారు విధుల్లో చేరనున్నారని తెలిపారు.
ఇదీ చదవండి:'రైతులతో మరోసారి చర్చలకు సిద్ధమే..'