తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Pune Accident: భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు- ఇద్దరు మృతి - మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం

Pune Accident: ఓ మినీ ట్రక్కు భక్తులపైకి దూసుకొచ్చిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో 13 మంది భక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

mini truck
మినీ ట్రక్కు

By

Published : Nov 27, 2021, 11:51 AM IST

Pune Accident: మహారాష్ట్ర పుణె జిల్లాలోని కన్హా గ్రామం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కాలినడకన వెళుతున్న భక్తుల మీదకు ఓ మినీ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతిచెందగా.. మరో 13 మందికి గాయాలయ్యాయి.

భక్తులంతా రాయ్​గఢ్ జిల్లా నుంచి.. సోలాపుర్​ జిల్లా పంధార్​పుర్​లోని విఠల స్వామి దేవాలయానికి కాలినడకన వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగిందన్నారు. గాయపడ్డ భక్తులను వివిధ ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. ట్రక్కు డ్రైవర్​ను అరెస్ట్​ చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details