జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్- ముగ్గురు ఉగ్రవాదులు హతం - కశ్మీర్లో ఎదురుకాల్పులు
ఎదురుకాల్పులు
07:57 July 14
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు సహా పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ అలియాస్ అబూ హురైరా హతమైనట్లు అధికారులు వెల్లడించారు.
భద్రత బలగాలు నిర్భంద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Last Updated : Jul 14, 2021, 8:38 AM IST