దేశ జనాభాలో 67శాతం మందిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే మరో 40 కోట్ల మందికి ఇన్‌ఫెక్షన్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) జాతీయ స్థాయిలో చేపట్టిన నాలుగో సెరో సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
50శాతం పిల్లలకు కరోనా..?
దేశంలో కరోనా వైరస్ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సెరో సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్-జులై మధ్యకాలంలో ఐసీఎంఆర్.. జాతీయ స్థాయిలో నాలుగో సెరో సర్వే చేపట్టింది. ఇందుకోసం ఈసారి చిన్నారులను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఇలా దేశంలో 6ఏళ్ల వయసుపైబడిన 67.6శాతం మందిలో కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 6-17ఏళ్ల వయసున్న వారిలో 50 శాతం కొవిడ్ ప్రభావానికి గురైనట్లు తాజా సర్వేలో తేలింది. ఇక 45-60ఏళ్ల వయసున్న వారిలో అత్యధికంగా (77.6శాతం) యాంటీబాడీలు ఉండగా.. 60ఏళ్లకు పైబడిన వారిలో ఇవి 76శాతం ఉన్నట్లు వెల్లడైంది.
85శాతం ఆరోగ్య కార్యకర్తల్లో..