తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీరీ పండిత్​ హత్యకు ప్రతీకారం.. ఇద్దరు ఉగ్రవాదులు హతం - Terrorists hiding in mosque

జమ్ము కశ్మీర్​లో.. ఇద్దరు తీవ్రవాదులను భద్రత బలగాలు కాల్చిచంపాయి. ఆదివారం జరిగిన కశ్మీరీ పండిత్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాయి. మసీదులో దాక్కున్న వారిని.. చాకచక్యంగా వ్యవహరించి హతమార్చాయి. ఈ ఘటనలో ఓ జవాన్​ అమరులయ్యారు.

militants killed by soldiers in jammu kashmir
కశ్మీరి పండిత్​ను చంపి మసీదులో దాక్కున్న తీవ్రవాదులు.. మట్టుబెట్టిన బలగాలు

By

Published : Feb 28, 2023, 4:26 PM IST

కశ్మీరీ పండిత్​ను చంపి, మసీదులో దాక్కున్న ఇద్దరు తీవ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో.. ఓ జవాన్​ సైతం ప్రాణాలు కోల్పోయారు. మసీదుకు ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్న అధికారులు.. చాకచక్యంగా వ్యవహరించి తీవ్రవాదులను హతమర్చారు. జమ్ము కశ్మీర్​లోని పుల్వామా జిల్లాలో ఈ ఘటన జరిగింది. మంగళవారం ప్రత్యేక ఆపరేషన్​ నిర్వహించిన భద్రత దళాలు.. అనంతరం ఉగ్రవాదులను కాల్చి చంపాయి.

కశ్మీరీ పండిత్​ను కాల్చి చంపిన ఆ ఇద్దరు తీవ్రవాదులు..
ఆదివారం ఈ ఇద్దరు తీవ్రవాదులు.. సంజయ్ శర్మ అనే ఓ బ్యాంక్​ సెక్యూరిటీ గార్డును కాల్చి చంపారు. అతడు ఓ కశ్మీరీ పండిత్​ కావడం గమనార్హం. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటలకు ఈ ఘటన జరిగింది. అనంతరం ఆ ఇద్దరు ఉగ్రవాదులు స్థానిక మసీదులోకి వెళ్లి తలదాచుకున్నారు.

తీవ్రవాదులు మసీదులో దాక్కున్నారని తెలుసుకున్న భద్రత బలగాలు.. ఆ పరిసరాలను చుట్టుముట్టాయి. మసీదుకు ఎటువంటి నష్టం జరగకుండా సంయమనం పాటించాయి. తీవ్రవాదులను మట్టుబెట్టేందుకు నిదానంగా ముందుకు కదిలాయి. అదే సమయంలో తీవ్రవాదులు.. బలగాలపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 55 రాష్ట్రీయ రైఫిల్స్​లో విధులు నిర్వర్తిస్తున్న ఓ జవాన్​కు బుల్లెట్​ తగిలింది. ​అతడి తొడ భాగంలోకి తూటా దూసుకెళ్లింది. దీంతో జవాన్​కు తీవ్ర రక్తస్రావం జరిగింది. అనంతరం ఆయన ప్రాణాలు కోల్పోయారు.

"ఒక తీవ్రవాదిని అకిబ్ ముస్తఫా భట్​గా గుర్తించాం. అతడిని మసీదు పరిసర ప్రాంతాల్లో మట్టుబెట్టాం. మరో తీవ్రవాదిని అజాజ్ అహ్మద్ భట్​గా గుర్తించాం. ఇతడు పుల్వామా దగ్గర్లో ఉన్న ట్రాల్ నివాసిగా తెలిసింది. అజాజ్.. మసీదు కీటికీలోంచి బయటకు దూకి.. ఓ ఇంట్లో తలదాచుకున్నాడు. సాంకేతిక పరిజ్ఞానంతో అతడిని కనిపెట్టిన బలగాలు.. అనంతరం అతడినీ మట్టుబెట్టాయి." అని అధికారులు తెలిపారు.

ఆదివారం తీవ్రవాదులో చేతిలో చనిపోయిన కశ్మీరీ పండిత్.. పుల్వామాలోని అచ్చన్​లో నివాసం ఉండేవాడు. అతడి ఇంటికి వంద మీటర్ల దూరంలో తీవ్రవాదులు కశ్మీర్ పండిత్​ను చంపేశారు. సంజయ్​ శర్మ మార్కెట్​కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అనంతరం అక్కడే ఉన్న కొంతమంది సంజయ్​ శర్మను.. ఆ​సుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సంజయ్​ మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details