పొరపాటున భారత సరిహద్దులోకి ప్రవేశించిన పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ బాలికలను తిరిగి తమ స్వస్థలాలకు పంపించారు అధికారులు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన అధికారులకు చకన్ దా బాగ్ క్రాసింగ్ పాయింట్ వద్ద ఇద్దరు బాలికలను అప్పగించారు. వారికి మిఠాయిలు, పలు కానుకలు ఇచ్చారు భారత అధికారులు.
భారత అధికారులు తమను బాగా చూసుకున్నారని బాలికలు తెలిపారు. ఇక్కడి ప్రజలు చాలా మంచివారని చెప్పుకొచ్చారు.
"మేం దారి తప్పిపోయి భారత భూభాగంలోకి వచ్చేశాం. ఆర్మీ సిబ్బంది మమ్మల్ని కొడతారని భయపడ్డాం. కానీ వారు బాగా చూసుకున్నారు. మమ్మల్ని ఇంటికి పంపించరేమోనని అనుకున్నాం.. కానీ ఇవాళే పంపించేశారు. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు."