తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైనర్​పై అత్యాచారం చేసిన దోషులకు మరణ శిక్ష.. శిశువును పీక్కు తిన్న కుక్కలు - ఇద్దరు రేపిస్టులను మరణశిక్ష

ఒడిశాలోని జగత్​సింగ్​పుర్​ జిల్లలోని ఫాస్ట్​ట్రాక్​ కోర్టు ఓ సంచలన తీర్పు వెలువరించింది. ఎనిమిదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులకు మరణ శిక్ష విధించింది. మరోవైపు, నవజాత శిశువును కుక్కలు పీక్కు తిన్నాయి. ఈ ఘటన కేరళలో జరిగింది.

Two Sentenced to Death in Odisha
odisha fast track court

By

Published : Nov 30, 2022, 11:37 AM IST

Updated : Nov 30, 2022, 12:55 PM IST

ఒడిశాలోని జగత్​సింగ్​పుర్​ జిల్లలోని ఫాస్ట్​ట్రాక్​ కోర్టు ఓ సంచలన తీర్పు వెలువరించింది. ఎనిమిదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులకు మరణ శిక్ష విధించినట్లు కోర్టు తెలిపింది.
వివరాలు ఇలా...
తీర్తోల్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో చాక్లెట్లు కొనుక్కుని ఇంటికి వెళ్తున్న ఓ ఎనిమిదేళ్ల చిన్నారిని గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు అపహరించారు. ఆపై తనను ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి చంపేశారు. 2014లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన తీర్పును తాజాగా వెలువరించింది కోర్టు. అయితే ఇద్దరు నిందితులైన షేక్​ ఆసిఫ్​తో పాటు షేక్​ ఆలిక్​కు మరణ శిక్ష విధించగా మరో ఇద్దరికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేనందున వారిని విడుదల చేసినట్లు తెలిపింది.

కుక్కపిల్లను రాళ్లతో కొట్టి చంపిన వ్యక్తి..
ఉత్తర్​ప్రదేశ్​లోని బదాయూ జిల్లాలో మంగళవారం మరో అమానీవయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఎలుక తోకకు రాయి కట్టి చంపిన ఉదంతం మరువక మందే మరో మూగజీవి ప్రాణాలను బలిగొన్నాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ ఘటనపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిందితుడు.. కుక్కపిల్లపై విచక్షణ రహితంగా రాళ్లతో దాడి చేశాడు. దాని మూగ సైగతో ఎంత మొత్తుకున్న వినని ఆ దుర్మార్గుడు ఆఖరికి దాన్ని అంతమొందించాడు. ఆ తర్వాత శునకాన్ని పూడ్చి పెట్టాడు. దీన్నంతటిని ఎవరో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు. విషయం తెలుసుకున్న జంతు ప్రేమికుడు వికేంద్ర శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కుక్కపిల్ల మృతదేహాన్ని వెలికితీసి శవ పరీక్షకు పంపించారు. విచారణ జరిపిన పోలీసులు.. నిందితుడిని ముకేశ్​ కుమార్​గా గుర్తించారు. విచారణలో తాను తప్పు చేసినట్లు ఒప్పుకున్న ఆ వ్యక్తి.. తన పిల్లలతో పాటు మరో ఇద్దరు చిన్నారులను కుక్క కరిచినందున ఈ పని చేశానని తెలిపాడు.

నవజాత శిశువు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు..
కేరళలోని మలప్పురంలో ఓ నవజాత శిశువు మృతదేహాన్ని వీధి కుక్కలు పీక్కు తిన్నాయి. మలప్పురంలోని చెన్నక్కాల్​లోని ఓ ఇంటి వద్ద కాకులు విపరీతంగా అరవడాన్ని గమనించిన యజమాని.. ఆ చిన్నారిని చూసి షాక్​కు గురయ్యాడు. అప్పటికే కుక్కలు ఆ మృతదేహాన్ని చీల్చి ముక్కలు చేశాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. శవ పరీక్ష నిమిత్తం తరలించారు. ఈ శవం ఇక్కడ మూడు రోజుల క్రితం నుంచి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ చిన్నారిని ఇక్కడ ఎవరు వదిలి వెళ్లారన్న కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Last Updated : Nov 30, 2022, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details